అమ్మల ద్వారా సంక్రమించిన అందంతో వెండితెరను ఏలారు...  టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మథర్స్ వీరే!

First Published May 19, 2021, 4:43 PM IST

హీరోయిన్ కావాలంటే కావలసిన మొదటి క్వాలిటీ అందం. రంగు, ఎత్తు, రూపు, మంచి శరీర సౌష్ఠవం ఆడపిల్ల అందానికి కావాల్సిన లక్షణాలు. మరి ఇవన్నీ తల్లి తండ్రుల ద్వారానే సంక్రమిస్తాయి. ఆరోగ్యంతో కూడిన అందమైన రూపు తల్లిదండ్రుల నుండి రావాల్సిందే. ముఖ్యంగా తల్లి అందంగా ఉంటే పిల్లలు అందంగా పుడతారు. తమ అందచందాలతో వెండితెరను ఏలుతున్న స్టార్ హీరోయిన్స్ కాజల్, సమంత, అనుష్క, తమన్నా వంటి స్టార్స్ మథర్స్ ఎలా ఉంటారో చూడండి.

చాలా కాలంగా టాలీవుడ్ ని ఏలుతున్న స్టార్ హీరోయిన్స్ లో కాజల్ ఒకరు కాగా, కుర్రాళ్ళ కలల రాణిగా పేరు తెచ్చుకున్నారు. పెళ్ళైనా కాజల్ ఇమేజ్ ఇంచ్ కూడా తగ్గలేదంటే ఆమె క్రేజ్ ఏమిటో చెప్పవచ్చు. ఇంతటి అందాన్ని అందించిన కాజల్ తల్లి సుమన్ అగర్వాల్ ఎంత అందంగా ఉన్నారో చూశారా.
undefined
టాలీవుడ్ క్వీన్ సమంత దశాబ్దకాలంగా టాలీవుడ్ టాప్ లో హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. చూడగానే ఎక్కడో చూసినట్లు, పరిచయం ఉన్నట్లు అనిపించే సమంతకు ఇంత చక్కటి రూపం ఇచ్చిన ఆమె తల్లి నైనెట్టే ప్రభుని మనం ఇక్కడ చూడవచ్చు.
undefined
స్వీటీ అనుష్క శెట్టి గ్లామర్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అనుష్కను చూసిన ఎవరికైనా ఆరాధనా భావం కలుగుతుంది. అందంతో పాటు గుణంలో కూడా మేలిమి బంగారం అనిపించుకున్న స్టార్ హీరోయిన్ అనుష్కకి జన్మను ఇచ్చిన తల్లి ప్రఫుల్లా శెట్టి ఈవిడే.
undefined
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎక్కువ మైలేజ్ కలిగిన హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. పరిశ్రమకు పరిచయమై 15ఏళ్ళు అవుతున్నా తమన్నా జోరు తగ్గలేదు . మరి ఈ ఎవర్ గ్రీన్ అందాన్ని కన్న రజినీ భాటియాకు ధన్యవాదాలు చెప్పాల్సిందే.
undefined
మహానటి కీర్తి సురేష్ తల్లి కూడా హీరోయిన్ కావడం విశేషం. స్టార్ హీరోయిన్ హోదా సంపాదించి తల్లిని మించిన కూతురిగా కీర్తి నిలిచింది. కీర్తి సురేష్ తల్లి పేరు మేనకా సురేష్ కాగా ఆమెను ఇక్కడ చూడవచ్చు.
undefined
టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి అందంలో కొంచెం  అటూ ఇటూ ఉన్నా అభినయం, నాట్యంలో అద్భుతం. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిన సాయి పల్లవి మదర్ రాధా కన్నన్ ఈవిడే.
undefined
టాలీవుడ్ సెక్సీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ని తలచుకుంటేనే యువతకు చెమటలు పడతాయి. చూడగానే కవ్వించే అందాలు కలిగిన ఈ అద్భుత సుందరికి జన్మను ఇచ్చింది నిర్మల్ రాజ్ పుత్.
undefined
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలతో ఆడిపాడిన రకుల్ గ్లామరస్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరుగాంచారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీకి జన్మనిచ్చిన తల్లి రాజేందర్ కౌర్.
undefined
click me!