రెండు సిమ్ కార్డ్స్ ఉంటే చుక్కలే ! కొత్తగా రీఛార్జ్ ప్లాన్స్ మార్పు..

First Published | May 8, 2024, 2:30 AM IST

ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ఫోన్‌లలో రెండు సిమ్ కార్డ్స్ స్లాట్‌లు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా రెండు సిమ్‌లను ఉపయోగించుకోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో 2 సిమ్ కార్డ్స్  ఉండటం కాస్త ఖర్చుతో  కావచ్చు. దీనికి సంబంధించి జియో, ఎయిర్‌టెల్ ఇంకా వోడాఫోన్ ఐడియా కలిసి  కొత్త ప్లాన్‌ను అభివృద్ధి చేశాయి.
 

టెలికాం పరిశ్రమలో టారిఫ్ పెంపు త్వరలో పెరిగే అవకాశం ఉందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇంతకుముందు డిసెంబర్ 2021లో టెలికాం ఛార్జీలు పెంచాయి. అప్పటి నుండి రెండున్నరేళ్లకు పైగా జియో, ఎయిర్‌టెల్ ఇంకా వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్‌లలో ఎటువంటి మార్పు లేదు.
 

జియో, ఎయిర్‌టెల్ ఇంకా  వొడాఫోన్ ఐడియా రాబోయే కొద్ది నెలల్లో  ప్రీపెయిడ్ అండ్  పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచవచ్చని  టెలికాం వర్గాలు తెలిపాయి.
 

Latest Videos


సిమ్ కార్డ్‌లు:

ఫోన్‌లో రెండు సిమ్ కార్డ్‌లను ఉపయోగించడం వల్ల యూజర్లకు సమస్యలు తెలెత్తవచ్చు. అంటే రెండు  సిమ్స్  యాక్టివ్‌గా ఉంచడానికి మీరు ఎక్కువ ఖర్చు  చేయాల్సి రావచ్చు. ప్రస్తుతం, Jio, Airtel ఇంకా Vodafone Idea SIM కార్డ్స్ యాక్టివ్‌గా ఉంచడానికి కనీసం 150 రూపాయల రీఛార్జ్ చేయడం అవసరం.

కానీ ఛార్జీల పెంపు తర్వాత రూ.150కి బదులుగా రూ.180 నుంచి రూ.200 వరకు ఉండవచ్చు. మీరు రెండు సిమ్ కార్డ్స్  వాడితే నెలకు కనీసం రూ.400 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ధర ఎంత పెరుగుతుంది?

ఇప్పుడు మీరు ప్రతినెల రూ. 300 రీఛార్జ్ చేసుకుంటే, ధరల పెంపు తర్వాత నెలకు దాదాపు రూ.75 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతినెల రూ.500 రీఛార్జ్ చేసుకుంటే రూ.125 ఇప్పుడు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ త్వరలో 5G రీఛార్జ్ ప్లన్స్  ప్రారంభించనున్నాయి. కానీ ఇప్పుడు 5G సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.  మీకు 5G SIM లేదా 4G SIM  ఉంటే ప్రతినెల ఖర్చు రీఛార్జ్ దాదాపు 50 శాతం వరకు పెరుగుతుంది. అయితే 5G ప్లాన్‌కి 4G ప్లాన్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుతం  ఫ్రీగా 5G సర్వీస్  అందించబడుతున్నప్పటికీ, 4G ఛార్జీలు కూడా పెరగడం వలన ఫోన్ ధరలు విపరీతంగా పెరగవచ్చు.

click me!