సినిమాల్లోకి రావాలనుకునే వారికి దిల్ రాజు వర్క్ షాప్, వివరాలు

Published : May 07, 2024, 08:45 AM ISTUpdated : May 07, 2024, 09:03 AM IST
 సినిమాల్లోకి రావాలనుకునే వారికి దిల్ రాజు వర్క్ షాప్, వివరాలు

సారాంశం

ఔత్సాహిక నటీన‌టులు, దర్శక రచయితలు, న‌వ‌త‌రం నిర్మాతలు, ఛాయాగ్రాహ‌కులు, ఎడిట‌ర్లు ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు ఇక్క‌డ అవ‌గాహ‌నా స‌ద‌స్సు (వర్క్‌షాప్) ని నిర్వ‌హిస్తున్నామ‌ని.

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్ర‌వేశించాల‌నుకునే కొత్తవారికి  అద్భుత‌మైన‌ అవ‌కాశం క‌ల్పించేందుకు ఇప్పుడు మ‌రోసారి ముందుకు వ‌చ్చారు ఇండ‌స్ట్రీ దిగ్గ‌జం దిల్ రాజు. డిస్ట్రిబ్యూషన్ తో  స‌హా సినీనిర్మాణంలో ద‌శాబ్ధాల అనుభవం ఉన్న దిల్ రాజు టెక్సాస్‌(అమెరికా)లోని వర్ధమాన ఫిలింమేక‌ర్స్ కి ఒక అరుదైన అవకాశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

 ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించే కొత్త‌వారికి పూర్తి స్థాయి స‌మాచారాన్ని, విజ్ఞానాన్ని అందించే ప్ర‌క్రియ‌. ఇన్ఫర్మేటివ్ సెషన్ 1 జూన్ 2024న డల్లాస్‌లోని స్టూడెంట్ సర్వీసెస్ బిల్డింగ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో జరుగుతుంద‌ని స‌మాచారం.  ఔత్సాహిక నటీన‌టులు, దర్శక రచయితలు, న‌వ‌త‌రం నిర్మాతలు, ఛాయాగ్రాహ‌కులు, ఎడిట‌ర్లు ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు ఇక్క‌డ అవ‌గాహ‌నా స‌ద‌స్సు (వర్క్‌షాప్) ని నిర్వ‌హిస్తున్నామ‌ని.. పేర్లు నమోదు చేసుకోమని దిల్ రాజు కోరారు. గుర్తు పెట్టుకోండి

తేదీ  June 1st, 2024
సమయం  Saturday, 2-4 PM
వెన్యూ  University of Texas, Dallas

నేటిత‌రం ప‌రిశ్ర‌మ‌లోకి రావాల‌ని దిల్ రాజు మ‌న‌స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామన్నారు.   కొత్త త‌రాన్ని ప్రోత్స‌హించ‌డం, ప్ర‌తిభ‌కు అవ‌కాశాలు క‌ల్పించ‌డం కోసమే  దిల్ రాజు ఈ వర్క్ షాప్ నిర్వహించనున్నారు.  సినిమాపై ప్యాష‌న్ తో వ‌చ్చే వారికి ఆయ‌న ఎప్పుడూ అండ‌గా నిలుస్తామని చెప్తున్నారు. ఈ క్రమంలోనే విదేశాల్లో దాగి ఉన్న‌ ప్ర‌తిభావంతుల‌కు ఆయ‌న‌వంతు స‌హ‌కారం అందించ‌టానికి సిద్దపడ్డారు.

మీరు ఇక్కడ నుంచి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 

https://www.eventbrite.com/e/cinema-aspiratns-meetup-with-dil-raju-tickets-897751106727
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?