అయితే వాహనాలు నిజానికి క్యాన్సర్ కారక బెంజైన్ స్థాయిలను ఉత్పత్తి చేస్తాయా ? అనే ఈ వాదన నిజమని ఏ అధ్యయనాలు ఇంకా డాక్యుమెంట్ స్పష్టం చేయలేదు. 2000 ప్రారంభంలో జపనీస్ పరిశోధనలో వ్యక్తిగత ఫోర్ వీలర్ వాడకం బెంజైన్‌తో సహా వివిధ విష వాయువులు, ప్రమాదకర పదార్థాలకు సున్నితత్వాన్ని పెంచుతుందని సూచించింది. కానీ దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు.
కానీ అమెరికన్ క్యాన్సర్ సొసైటీ మాత్రం ఏసీ ఆన్ చేసే ముందు వేడిగాలిని బయటకు వదలడం మంచిదని, అది కేవలం బెంజైన్ వల్ల కాదని చెబుతోంది.
అదేమిటంటే, కారణాలతో సంబంధం లేకుండా, కారులో ఏసీని ఆన్ చేసే ముందు కారు కిటికీలను దించి, స్వచ్ఛమైన గాలిని లోపలికి వచ్చిన తర్వాత మాత్రమే ఏసీని ఆన్ చేయడం మంచిది.
చాలా సేపు ఎండలో ఉన్న కార్ తీసుకెళ్తున్నప్పుడు అన్ని విండోస్ క్రిందకి దింపండి , టాప్ స్పీడ్ లో ఫ్యాన్‌ను రన్ చేయండి. దీని వల్ల వేడి గాలిని సులభంగా బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది. తర్వాత అద్దాలు క్లోజ్ ఏసీ ఆన్ చేయండి. దుమ్ము లేని ఫ్రెష్ గాలి ఉన్న పరిస్థితుల్లో మాత్రమే ACని వెంటిలేషన్ లేదా అవుట్ ఎయిర్ మోడ్‌లో ఉంచండి. AC రీసర్క్యులేషన్ మోడ్‌లో కార్ లోపల గాలిని చల్లబరుస్తుంది. కార్ లోపల త్వరగా చల్లబరచడానికి ఈ మోడ్ ఉత్తమం.
అలాగే, AC తక్కువగా నడుస్తున్నట్లు అనిపిస్తే ACని మెకానిక్ ద్వారా చెక్ చేసి సర్వీస్ చేయండి.