రాజమౌళికి ఝలక్‌.. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఒక హీరోని ఎక్కువ, మరో హీరోని తక్కువ చేయడంపై ప్రశ్న.. జక్కన్న సమాధానమిదే

Published : May 07, 2024, 07:28 PM IST
రాజమౌళికి ఝలక్‌.. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఒక హీరోని ఎక్కువ, మరో హీరోని తక్కువ చేయడంపై ప్రశ్న.. జక్కన్న సమాధానమిదే

సారాంశం

రాజమౌళికి `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఒక హీరో ఎక్కువ, మరో హీరో తక్కువ ప్రశ్న ఎదురయ్యింది. దీనికి ఆయన రియాక్షన్‌ మాత్రం క్రేజీ అని చెప్పాలి. రిపోర్టర్‌కి ఝలక్‌ ఇచ్చాడని చెప్పొచ్చు.  

రాజమౌళి.. `బాహుబలి` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ కాదు, తెలుగు అని చూపించాడు. సినిమా లెక్కలు మార్చేశాడు. ఎవరూ చేయని సాహసం చేసి సక్సెస్‌ అయ్యాడు. సినిమాలకు బడ్జెట్‌ గేట్ల ఎత్తేసేలా చేశాడు. మార్కెట్‌ పరిధిని పెంచాడు. లార్జర్‌ దెన్‌ లైఫ్‌ అనేలా సినిమా స్థాయినే పెంచేశాడు. ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్‌ పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారనంటే దానికి ఆయనే కారణమని చెప్పొచ్చు. 

చివరగా `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాన్ని తెరకెక్కించారు జక్కన్న. ఈ మూవీ రెండేళ్ల క్రితం విడుదలైంది. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించింది. సుమారు 1200కోట్లు వసూలు చేసింది. కానీ నిర్మాత హ్యాపీ కాదని టాక్‌. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోలను సమానంగా చూపించలేదని, రామ్‌ చరణ్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, ఎన్టీఆర్‌ని తొక్కేశారని, ఆయన్ని సపోర్టింగ్‌ క్యారెక్టర్‌గా మార్చారని వారి అభిమానులు, సాధారణ ఆడియెన్స్ కూడా అన్నారు. అప్పట్నుంచి దీనికి సంబంధించిన ట్రోల్స్ జరుగుతూనే ఉంది. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత రాజమౌళి మీడియా ఇంటరాక్షన్‌ ఎప్పుడూ జరగలేదు. రెండేళ్ల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. అడపాదడపా ఈవెంట్లలోనే కనిపించే ఆయన తాజాగా `బాహుబలి` యానిమేషన్‌ ఫిల్మ్ కోసం వచ్చారు. యానిమేషన్‌ మూవీని త్వరలోనే రిలీజ్‌ చేయబోతున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. సిరీస్‌ మాదిరిగా దీన్ని ప్రసారం చేయబోతున్నారు. అందులో భాగంగా తాజాగా మీడియా కోసం రెండు ఎపిసోడ్లని ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో రాజమౌళికి షాకిచ్చే ప్రశ్నలు ఎదురయ్యాయి. 

ఇలా యానిమేషన్‌ చేసిన `బాహుబలి` సినిమాని చెడగొట్టినట్టు అనిపించలేదా అని అడగ్గా, ఆడియెన్స్ నుంచి స్పందన బాగా వస్తుందని ఆశిస్తున్నామని, బాగానే చేశారని తెలిపారు. తాము చెడగొట్టామని భావించడం లేదన్నారు. ఈ సందర్భంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రశ్న ఎదురయ్యింది. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఒక హీరోని ఎక్కువ, మరో హీరోని తక్కువ చేశారని విమర్శలు వచ్చాయి. దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించగా, రాజమౌళి తప్పించుకున్నాడు. దానికి సమాధానం చెప్పడానికి ఇది సందర్భం కాదు, సమయం కాదు, వేదిక కాదు అని వెల్లడిస్తూ దాన్ని దాటవేశాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు