టిమ్ కుక్ & టీమ్ ఏమని ప్రకటించారంటే:
1. ఐప్యాడ్ ఎయిర్ (2024)
కొత్త ఐప్యాడ్ ఎయిర్ M2 చిప్‌తో వస్తుంది, అయితే ఇంతకుముందు ఉన్న M1 ఎయిర్ కంటే "50 శాతం ఫాస్ట్" అని తెలిపింది, అలాగే గొప్ప పర్ఫార్మెన్స్ పెంచుతుందని వెల్లడించింది. ఈ ఐప్యాడ్ ఎయిర్ ల్యాండ్‌స్కేప్ ఓరియంటేషన్ కోసం తయారు చేయబడింది, మీరు ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో పట్టుకున్నప్పుడు కూడా స్టీరియో స్పీకర్‌లు ఉంటాయి. కొత్త బ్లు, పర్పుల్, అలాగే స్టార్‌లైట్ ఇంకా స్పేస్ గ్రే కలర్స్ లో వస్తుంది. ఐప్యాడ్ ఎయిర్ (2024) నిజానికి రెండు సైజెస్ లో వస్తుంది. వీటిలో11-అంగుళాల ఐప్యాడ్ ఎయిర్ అలాగే 13-అంగుళాల ఐప్యాడ్ ఎయిర్ ఉంటుంది. 13-అంగుళాల మోడల్‌లో 30% ఎక్కువ స్క్రీన్ ఉంటుంది.
ఈ డివైజ్ AI ఫీచర్స్ కు సపోర్ట్ చేస్తుంది. Apple iPad Air స్మోత్ ఫినిషింగ్, ల్యాండ్‌స్కేప్ స్టీరియో ఆడియో, మ్యాజిక్ కీబోర్డ్, 5G కనెక్టివిటీ, 12MP కెమెరా, 1TB వరకు స్టోరేజ్‌లో అందుబాటులో ఉంటుంది. 11-అంగుళాల వేరియంట్ ధర $599 నుండి ప్రారంభమవుతుంది, అయితే 13-అంగుళాల మోడల్ ధర $799 నుండి స్టార్ట్ అవుతుంది. ప్రీ-ఆర్డర్‌లు కూడా నేటి నుండి ఓపెన్ అవుతాయి, డెలివరీస్ వచ్చే వారం నుండి ఉంటాయి.