పవన్ కళ్యాణ్ కు మద్దతు గా ప్రచారంకి వెళ్తున్న టాప్ ప్రొడ్యూసర్

Published : May 07, 2024, 10:49 AM IST
 పవన్ కళ్యాణ్ కు మద్దతు గా ప్రచారంకి వెళ్తున్న టాప్ ప్రొడ్యూసర్

సారాంశం

 పవన్ కళ్యాణ్ ను గెలిపించడం కోసం పిఠాపురం నియోజకవర్గంలో సినీ, బుల్లితెర సెలబ్రిటీలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు.  హైపర్ ఆది, జానీ మాస్టర్, హీరోయిన్ నమిత, మెగా హీరోలు ..


 గత ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా వచ్చి సినిమా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం  మెల్లిగా ఓపెన్ అవుతున్నారు. టాలీవుడ్ లో చాలా మంది సినీ పెద్దలు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు. ఈసారి తమ సపోర్ట్ పవర్ స్టార్ కే అంటూ వాళ్లు చెప్తున్నారు. జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ పడుతోంది. తెలుగుదేశం, బిజెపితో కలిపి ఆయన ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నాడు.  ఈ ఐదేళ్లుగా జనసేన పార్టీని, తన కేడర్ ను పెంచుకునే ప్రయత్నం చేశాడు పవన్. ఈసారి కచ్చితంగా ఏపీ ఎన్నికలలో జనసేన ప్రభావం భారీగా ఉండబోతుందని  అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్ది పిఠాపురంలో ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంటుంది. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృఢ నిశ్చయంతో ఉంటే, పవన్ కళ్యాణ్ ను గెలిపించడం కోసం పిఠాపురం నియోజకవర్గంలో సినీ, బుల్లితెర సెలబ్రిటీలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు.  హైపర్ ఆది, జానీ మాస్టర్, హీరోయిన్ నమిత, మెగా హీరోలు పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.
 
ఇప్పుడు యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీకూడా రంగంలోకి దిగారు. ఆయన పిఠాపురం వెళ్లి జనసేన తరుపున ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.నాగవంశీ (Nagavamsi) పవన్ తో  సినిమాలు చేశారు. ఆయనకు  స్నేహితుడైన త్రివిక్రమ్‌ (Trivikram) ఆ సంస్థకు బాగా కావలసిన మనిషి. దాంతో సితార సంస్థ మద్దతు పవన్ కు  తప్పకుండా ఉంటుంది. తాజాగా ఈ విషయాన్ని 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌లో నాగవంశీ మాట్లాడారు. పవన్‌కు తమ మద్దతు ఉంటుందని స్వయంగా తెలిపారు. మే 12వ తేదీకి పవన్  అభిమానులంతా ఏపీ చేరుకొని, 13న ఓటింగ్‌ లో పాల్గొనాలని కోరారు. అదే పవన్‌ కల్యాణ్‌కు అభిమానులు చేసే గొప్ప సేవ అని పేర్కొన్నారు. "ఆంధ్రాలో ఓటు హక్కు ఉన్న చాలామంది యువత హైదరాబాద్‌లో సెటిలైపోయారు. వాళ్లంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంతూర్లు వెళ్లాలి (Ap Elections). ఈ ఓటింగ్‌ శాతం గెలుపు, ఓటములపై తప్పకుండా ప్రభావం చూపుతుంది’’ అని నాగవంశీ అన్నారు . 

కొందరు దర్శకనిర్మాతలు బయటకు చెప్పకపోయినా ఇప్పటికే పవన్‌ వెనుక ఉన్నారు. ఆర్థికంగానూ తమ వెన్నుదన్ను అందిస్తున్నారు. పవన్‌ ప్రచారంలో అది ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు నాగవంశీ మాటల్ని బట్టి, సితార కూడా పవన్‌ వెనుక ఉందన్న విషయం క్లారిటీ వచ్చింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?