ఈరోజు ఎపిసోడ్ లో మల్లిక దేవుడు ముందు కూర్చుని అక్కడ ఉన్న ఆకులను చూసి షాక్ లో ఉంటుంది. అప్పుడు మల్లిక ఒసేయ్ చికిత ఈ లక్ష పత్ర పూజ అంటే ఎప్పుడు పూర్తవ్వాలి అంటూ ఏడుపు ముఖం పెట్టగా వెంటనే పనిమనిషి చికిత అమ్మగారి మీకోసం ముక్కున్నారు కదా అమ్మా చేయాల్సిందే అని అంటుంది. అప్పుడు చికిత నేను 1000 ఆకులు తీసుకుని వచ్చి ఇక్కడ వేస్తాను నువ్వు పూజ చెయ్యి అమ్మగారు అని అనగా వెంటనే మల్లిక నేను మనసులో మమ అనుకుని పూజ చేస్తాను ఈ పూజ ఏదో చికిత ప్లీజ్ ప్లీజ్ అని అంటుండగా ఇంతలో అక్కడికి గోవిందరాజులు వస్తాడు. అమ్మ మల్లిక నువ్వు చేసిన పనులు దోషాలు పోవాలి అంటే ఈ పూజ చేయాల్సిందే అని అంటాడు.