- Home
- Entertainment
- కృష్ణతో సినిమా, సీనియర్ నటుడిపై విరుచుకుపడ్డ ఎన్టీఆర్.. చివరికి తన తప్పు తెలుసుకుని ఏంచేశారంటే
కృష్ణతో సినిమా, సీనియర్ నటుడిపై విరుచుకుపడ్డ ఎన్టీఆర్.. చివరికి తన తప్పు తెలుసుకుని ఏంచేశారంటే
ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు ఉన్న సమయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. ఎన్టీఆర్, కృష్ణ విభేదాల వల్ల ఒక సీనియర్ నటుడు ఇబ్బంది పడ్డారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఎన్టీఆర్, కృష్ణ విభేదాలు
ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఒక దశలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి ఎన్టీఆర్ ఆయనతో మాట్లాడటం మానేశారట. అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయిన కొన్నేళ్ల తర్వాత కృష్ణ, ఎన్టీఆర్ మధ్య మరోసారి వివాదాలు భగ్గుమనేలా ఓ సంఘటన జరిగింది. దీని గురించి సీనియర్ నటుడు గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.
కృష్ణతో సింహగర్జన
గిరిబాబు విలన్ గా అనేక చిత్రాల్లో నటించారు. ఆయన దర్శకుడిగా నిర్మాతగా కూడా సినిమాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా గిరిబాబు సింహగర్జన అనే చిత్రాన్ని 1978లో నిర్మించారు. అదే సమయంలో ఎన్టీఆర్ సింహబలుడు అనే జానపద చిత్రంలో నటిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, గిరిబాబు చిత్రం కూడా జానపద కథాంశమే.
నా గురించి ఎన్టీఆర్ కి చాడీలు
గిరిబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది ఆయనకి నా గురించి కంప్లైంట్ చేశారు. గిరిబాబు అనే వాడు ఒకడున్నాడు. మనకు వ్యతిరేకమైన కృష్ణతో మీకు పోటీగా ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. మనది సింహబలుడు అయితే.. వాళ్లది సింహగర్జన. రెండు కూడా జానపద చిత్రాలే అని నా గురించి బాగా చాడీలు చెప్పారు. దీంతో నిజమే అని నమ్మిన ఎన్టీఆర్ కి నాపై కోపం వచ్చింది. గిరిబాబుఅనే చోటా గాడు నాకే పోటీగా కృష్ణతో సినిమా చేస్తాడా అని ఎన్టీఆర్ ఫైర్ అయ్యారట.
ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి వివరణ
ఆయన నాపై కోపంతో ఉన్నారని నాకు తెలిసింది. దీంతో మరుసటి రోజు ఉదయాన్నే 6 గంటలకి ఆయన ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ఉన్న అసిస్టెంట్లు అంతా నన్ను ఆశ్చర్యంగా చూశారు. వెంటనే వెళ్లి ఎన్టీఆర్ కి చెప్పారు. దీంతో ఆయన లోపలికి రమ్మని పిలిచారు. ఏం బ్రదర్ ఏమిటి అని కోపంగా అడిగారు. అన్నగారు మీతో 5 నిమిషాలు మాట్లాడాలి టైం ఇస్తారా అని అడిగా. సరే చెప్పండి అని అన్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చదువు పక్కన పెట్టి నటుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చాను. విలన్ గా నటిస్తున్నాను.
ఎన్టీఆర్ రియాక్షన్
సినిమా మీద ఆసక్తితో ప్రస్తుతం నిర్మాతగా కూడా ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే కృష్ణతో సింహ గర్జన అనే సినిమా చేస్తున్నాను. సింహబలుడు, సింహ గర్జన రెండు చిత్రాలు ఒకే తరహా కథ అని, మీకు పోటీగా చేస్తున్నామని ఎవరో మీకు చెప్పారు. మీకు పోటీగా సినిమా చేయడానికి నేను ఎవరిని అని చెప్పా. దీంతో ఆయనకే కాస్త కోపం తగ్గింది. స్టోరీ లైన్ కూడా వివరించారు. అప్పుడు పూర్తిగా ఎన్టీఆర్ గారికి అర్థమైంది. ఈ రెండు చిత్రాలకు సంబంధం లేదు. రెండు వేరువేరు కథలు. ఇట్స్ ఆల్ రైట్. వెళ్లి సినిమా బాగా తీయండి అని ఆయనే ప్రోత్సహించారు అని గిరిబాబు తెలిపారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సింహబలుడు షూటింగ్ కి వెళ్లి తన గురించి చాడీలు చెప్పిన వారిని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. గిరిబాబు గురించి అబద్దాలు ఎందుకు చెప్పారు అని ప్రశ్నించారట.