ఆ తర్వాత సీన్లో మహేంద్ర కోపంతో జగతిన, ఏవైనా మాట్లాడు జగతి ఇక్కడ పనులన్నీ అయిపోతున్నాయి. ఆ రిషి సాక్షిని పెళ్లి చేసుకోవడమేంటి అసలు ఇంతవరకు వస్తాడని నేను అనుకోలేదు. ఇక్కడ నువ్వు మాట్లాడక, నేను మాట్లాడక, వసూ మాట్లాడక, అన్నయ్య మాట్లాడక,ఇలాగ కూర్చుంటే తాలి కూడా కట్టేస్తాడు. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని అంటాడు. అప్పుడు జగతి,మనం వెళ్ళిపోతే దేవయాని అక్కయ్య మాయమాటలు చెప్పి ఇప్పటికిప్పుడే సాక్షి మెడలో తాడి కట్టించేస్తుంది.