వయసొచ్చిన కొత్తలో సమంత ఇలా ఉండేదా?... మై స్వీట్ 16 అంటూ శాకుంతలం బ్యూటీ సంచలన పోస్ట్!

First Published Apr 25, 2023, 1:39 PM IST


సమంత త్రో బ్యాక్ ఫోటో షేర్ చేశారు. పదహారేళ్ళ ప్రాయంలో ఆమె ఎలా ఉన్నారో తెలియజేస్తూ అద్భుతమైన ఫోటో వెలుగులోకి తెచ్చారు. 
 

Samantha


స్టార్ లేడీ సమంత కెరీర్లో పీక్స్ చూశారు. ఆమె ఎదుగుదల చాలా మందికి స్ఫూర్తి. ఎలాంటి సినిమా నేపథ్యం లేని మిడిల్ క్లాస్ అమ్మాయి అయిన సమంత కేవలం టాలెంట్ తో ఈ స్థాయికి చేరారు. ఇండియా వైడ్ ఫేమ్ రాబట్టారు. సమంత రెమ్యూనరేషన్ రూ. 5 కోట్లకు పైమాటే. అది ఆమె రేంజ్. 
 

Samantha

చదువుకునే రోజుల్లోనే సమంత నటన మీద ఆసక్తి పెంచుకున్నారు. పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేశారు. సినిమా ఆఫర్స్ పొందేందుకు ఆడిషన్స్ చేస్తూ ఉండేవారు. 16 ఏళ్ల వయసులో మోడలింగ్ లో భాగంగా తాను దిగిన ఓ ఫోటో సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. సమంత త్రో బ్యాక్ పిక్ వైరల్ గా మారింది.

Latest Videos


Samantha

యంగ్ ఏజ్ లో సమంత లుక్ చూసిన ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మాస్కోవిన్ కావేరి చిత్రంతో సమంత నటిగా మారారు. అయితే ఆ మూవీ డిలే కాగా ఏమాయ చేసావే మొదటి చిత్రమైంది. 2010లో నాగ చైతన్య హీరోగా విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. అక్కడి నుండి సమంత సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ పోయింది. 
 

Samantha


కాగా కెరీర్లో ఫస్ట్ టైం శాకుంతలం రూపంలో భారీ షాక్ తగిలింది. గతంలో ఎన్నడూ సమంత ఇంత పెద్ద ఫెయిల్యూర్ సోలోగా ఫేస్ చేయలేదు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం వసూళ్లు దారుణంగా ఉన్నాయి. పెట్టుబడిలో ఐదు పది శాతం కూడా తిరిగొచ్చే పరిస్థితి లేదు. సాయంత్రం నుండి శాకుంతలం థియేటర్స్ ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. 


శాకుంతలం చిత్ర ఫెయిల్యూర్ పై సమంత స్పందించడం విశేషం. పరోక్షంగా ఇదంతా కర్మఫలం అని తేల్చేశారు. ప్రయత్నం చేయడం వరకే మన చేతుల్లో ఉంటుంది. వాటి ఫలితం మీద కాదని చేప్పే భగవద్గీత లోకి శ్లోకాన్ని పోస్ట్ చేసింది. ఆమె శాకుంతలం ప్రేక్షకులకు నచ్చలేదని సమంత నేరుగా ఒప్పుకున్నారు. 
 

ప్రస్తుతం సమంత సిటాడెల్ తో పాటు విజయ్ దేవరకొండ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ ఖుషి టైటిల్ తో ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. ఖుషి చిత్రీకరణ చివరి దశకు చేరింది. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత మజిలీ చిత్రం చేశారు. అది సూపర్ హిట్ కొట్టింది. 

click me!