ఆ స్టార్ డైరెక్టర్ బూతులు తిట్టాడు, ఆఫీస్ బాయ్ కంటే దారుణంగా ట్రీట్ చేశారు... ప్రశాంత్ వర్మ కామెంట్స్ 

First Published Jan 15, 2024, 12:13 PM IST


దర్శకుడు ప్రశాంత్ వర్మ కెరీర్ బిగినింగ్ లో ఎదురైన ఇబ్బందులు, అవమానాల గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. ఈ క్రమంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. 
 

Prashanth Varma

హనుమాన్ మూవీతో ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ హిందీలో కూడా సత్తా చాటుతుంది. బాలీవుడ్ ప్రముఖులు హనుమాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగులో ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. 

తక్కువ బడ్జెట్ తో అంత క్వాలిటీ ఎఫ్ విఎఫ్ఎక్స్ ఇచ్చినందుకు కొనియాడుతున్నారు. తేజ సజ్జాకు మంచి హిట్ పడింది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జా కాంబోలో ఇది రెండో చిత్రం. గతంలో వీరి కాంబోలో జాంబి రెడ్డి విడుదలైంది. రెండో మూవీతో భారీ హిట్ కొట్టారు. 

Latest Videos


కాగా ప్రశాంత్ వర్మకు దర్శకుడిగా ఎదిగే క్రమంలో అనేక అవమానాలు, ఒడిదుడుకు ఎదురయ్యాయట. ఆ అనుభవాలు లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ... ఇంజనీరింగ్ చదివే రోజుల్లో షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు చేశాను. వాటికి దక్కిన సర్టిఫికెట్స్ పట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇస్తారని తిరిగేవాడిని. 


కానీ వాటిని చూసి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేవాళ్ళు. అందుకే వాటిని తీసుకెళ్లడం మానేశాను. ఒకరు రికమెండ్ చేస్తే ఓ డైరెక్టర్ అవకాశం ఇచ్చాడు. ఆ డైరెక్టర్ రేయ్ వెళ్లి మంచి నీళ్లు తీసుకురా అన్నాడు. నన్ను కాదనుకుని నేను అటూ ఇటూ చూశాను. రేయ్ నిన్నేరా అన్నాడు. కిచెన్ లో నుండి బయటకు వచ్చేశాను. 
 

ఇదే డైరెక్టర్ నా వద్దకు ఓ సహాయం కోసం వచ్చాడు. ఆయన అడిగింది చేసి పంపాను. ఆ డైరెక్టర్ కి అప్పటి సంఘటన గుర్తు లేదు. నన్ను ఆయన మర్చిపోయాడు. నేను గతాన్ని తవ్వాలి అనుకోలేదు. 

ఓ స్టార్ డైరెక్టర్, నిర్మాత మాట్లాడుకుంటున్నారు. నేను కొద్ది దూరంలో నిల్చుని ఉన్నాను. రేయ్ నీకు ఇక్కడ ఏం పనిరా అని ఆ డైరెక్టర్ నన్ను బూతులు తిట్టాడు. ఒక దశలో ఇండస్ట్రీ మనకు సెట్ కాదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. చిన్నప్పటి నుండి ఇంట్లో వాళ్ళు నన్ను ఒక్కమాట అనేవాళ్ళు కాదు. 


ఎవరితో మాటపడిన సందర్భం లేదు. అలాంటి నాకు ఎదురైన అవమానాలు బాధపెట్టాయి... అని చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ వర్మ 2018లో విడుదలైన 'అ' మూవీతో దర్శకుడు అయ్యాడు. కల్కి, జాంబి రెడ్డి చిత్రాలు తెరకెక్కించాడు. 
 

click me!