మూడేళ్ళ వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాః `దంగల్‌` నటి ఫాతిమా

First Published | Oct 30, 2020, 7:10 PM IST

తాను మూడేళ్ళ వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు, అలాగే ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ని ఎదుర్కొన్నానని సంచలన విషయాలు వెల్లడించింది `దంగల్‌` ఫేమ్‌ ఫాతిమా సనా షేక్‌. 

బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఫాతిమా ఐదేళ్లలోనే `ఇష్క్` చిత్రంతో బాల నటిగా నటించింది. ఈ చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయమై ఆకట్టుకుంది. ఆ తర్వాత `చాచి420`, `బడే దిల్వాలా`, `వన్‌ 2 కా 4` చిత్రాల్లో బాల నటిగా మెప్పించింది.
ఏడేళ్ళు గ్యాప్‌ తీసుకుని 2008లో `తహాన్‌` చిత్రంలో మెరిసింది. నాలుగేళ్ల తర్వాత `బిట్టూ బాస్‌`లో నటించింది. `ఆకాష్‌వాణి`లో హీరోయిన్‌గా కనిపించింది.

తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చిందీ సొట్టబుగ్గల సుందరి. `నువ్వు నేను ఒక్కటవుదాం` చిత్రంలో హీరోయిన్‌గా మెరిసింది. కానీ ఎవరూ ఈ అమ్మడిని పెద్దగా పట్టించుకోలేదు. ఈక్రమంలోనే అమిర్‌ ఖాన్‌ `దంగల్‌` చిత్రంలో గీతా ఫోగత్‌ పాత్రలో నటించింది. అద్భుత నటనతో అమీర్‌ ఖాన్‌కి దీటుగా నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనంసృష్టించడంతో పాపులర్‌ అయ్యింది ఫాతిమా.
ఆ వెంటనే అమీర్‌ ఖాన్‌ `థగ్స్ ఆఫ్‌ హిందూస్థాన్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో బలమైన పాత్రలో యాక్షన్‌ చేసి అదరగొట్టింది. కానీ ఈ సినిమా ఆదరణపొందలేదు. ఆ మధ్య `పల్కేన్‌ ఖోలో` అనే మ్యూజిక్‌ వీడియోలో మెరిసిన ఫాతిమా ఇప్పుడు `లుడో`, `సురజ్‌ పే మంగల్‌ భరి` చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపుటెలివిజన్‌లోనూ నటిస్తూ మెప్పిస్తుంది.
తాజాగా పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది ఫాతిమా. తాను మూడేళ్ళ వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యిందట. ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫాతిమామాట్లాడుతూ, `మూడేళ్ల వయసులో నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా. ఆ ఘటన నా జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నా చుట్టూ అదొక కళంకంగా మారిపోయింది.అందుకే మహిళలు ఇలాంటి విషయాల్లో నోరు తెరవరు` అని తెలిపింది.
అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని, అన్ని విషయాలపై మహిళలకు అవగాహన వస్తుంది. ఏదైనా బహిరంగంగా చెప్పగలుగుతున్నారు. భిన్నంగా ఆలోచిస్తున్నారు. అందుకేఇప్పుడు వీటిపై చర్చ జరుగుతుందన్నారు.
ఇంకా చెబుతూ, తాను కూడా కాస్టింగ్‌ కౌచ్‌ని ఎదుర్కొన్నట్టు తెలిపింది. సెక్స్ కి ఓకే చెబితేనే పని లభిస్తుందనే పరిస్థితులను సృష్టించారు. ఉద్యోగం కావాలంటే సెక్స్ కి ఓకేచెప్పడమే ఏకైక మార్గమంటున్నారు. ఒప్పుకోకపోతే పనిలో నుంచి నన్ను తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. నేను ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారంటే ఒకరిరిఫరెన్స్ ద్వారానే అనే విషయం నాకు తెలుసు` అని కెరీర్‌ బిగినింగ్‌లోనే అనేక నిజాలను నిర్మోహమాటంగా చెప్పేసింది ఫాతిమా.

Latest Videos

click me!