నవీన్ పోలిశెట్టి హీరోగా మణిరత్నం దర్శకత్వంలో కొత్త సినిమా అంటూ వార్తలు వచ్చాయి. ఇది ప్రేమకథ అని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తలను దర్శకుడు మణిరత్నం ఖండించారు.
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా మణిరత్నం దర్శకత్వంలో కొత్త సినిమా అంటూ వార్తలు వచ్చాయి. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తలను దర్శకుడు మణిరత్నం ఖండించారు. ఇలాంటి వార్తలు ఎలా వ్యాపిస్తాయో తెలియదని ఆయన అన్నారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన వెల్లడించారు.
`థగ్ లైఫ్` సెన్సార్ రిపోర్ట్
మణిరత్నం ప్రస్తుతం 'థగ్ లైఫ్' చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కలిసి చేస్తున్న ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది. ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది. దీనికి 'యు/ఎ' సర్టిఫికెట్ వచ్చింది. నిడివి 165 నిమిషాలు.
సినిమాలో శింబు, జోజు జార్జ్, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, నాజర్, అశోక్ సెల్వన్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, జిష్షు సేన్ గుప్తా, సాన్యా మల్హోత్రా, రోహిత్ శరాఫ్, వైయపురి వంటి తారాగణం నటిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
ప్రమోషన్స్ లో `థగ్ లైఫ్` టీమ్ బిజీ
మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం కోసం టీమ్ జోరుగా ప్రచారం చేస్తుంది. ఆ మధ్య తెలుగులోనూ ప్రెస్ మీట్ నిర్వహించారు. కమల్ హాసన్‌తోపాటు టీమ్ మొత్తం పాల్గొంది. ఇందులో కమల్ తెలుగు ఆడియెన్స్ వల్లే తాను స్టార్ అయ్యానని చెప్పడం విశేషం. కన్నడ, కేరళా, హిందీ, చెన్నైలోనూ ప్రమోషన్స్ చేస్తూ టీమ్ బిజీగా ఉంది.
స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్‌తో మణిరత్నం `థగ్ లైఫ్`
మణిరత్నంతో ఎప్పటినుంచో పనిచేస్తున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ సినిమాకు కూడా పనిచేశారు. మణిరత్నం గత చిత్రాలైన 'కన్నత్తిల్ ముత్తమిట్టాల్', 'ఆయుధ ఎళుత్తు' లకు పనిచేసిన రవి కె చంద్రన్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రఫీ అందించారు.
'విక్రమ్' సినిమాకు పనిచేసిన అన్బరివ్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశారు. రంజిత్ అంబాడి మేకప్, శర్మిష్టా రాయ్ ప్రొడక్షన్ డిజైన్, ఏకా లఖాని కాస్ట్యూమ్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇలా స్ట్రాంగ్ టెక్నీకల్ టీమ్ ఈ మూవీకి పనిచేస్తుండటం విశేషం.