Intinti Gruhalakshmi: అత్త దెబ్బకి వణికిపోతున్న దివ్య.. తులసి వాళ్లకు అవమానం జరిగేలా ప్లాన్ చేసిన లాస్య?

First Published Apr 25, 2023, 8:51 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. కూతురు జీవితాన్ని చేజేతులా నాశనం చేశానని కలవర పడుతున్న ఒక తండ్రి కథ ఈ సీరియల్. ఈరోజు ఏప్రిల్ 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో అక్షింతలు కలుపుతున్న దివ్య దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది బసవయ్య భార్య. అక్షింతలు కలుపుతున్నాను పిన్ని అంటే బియ్యం ని కొంచెం తడి చేసి పసుపు కలిపి అప్పుడే అంటుకుంటుంది ఆ మాత్రం కూడా నేర్పించలేదా మీ అమ్మ అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇందులో అమ్మ తప్ప ఏమీ లేదు పిన్ని నాకే టైం దొరక పనులు నేర్చుకోలేదు అంటూ సంజాయిషీ ఇస్తుంది దివ్య. ఇందాక మావాడు, నువ్వు చెంగుచెంగు మని ఒకరి వెనుక ఒకరు పరిగెడుతున్నారు.. అవి మాత్రం ఎవరు నేర్పారు.. అలాగే పనులు కూడా త్వర త్వరగా నేర్చుకోవాలి అంటూ గదమాయిస్తాడు బసవయ్య. 

అలాగే దీపపు కుందులు కడగడం రాకపోయినా సాధిస్తుంది బసవయ్య భార్య. ఇంకా ఇక్కడే ఉంటే పూజకి టైం అయిపోతుంది. వెళ్లి మండపం అలంకరించి మామిడి తోరణాలు కట్టు అంటూ రాజ్యలక్ష్మి గధమాయిస్తుంది. ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది దివ్య. అమ్మ పనులు నేర్చుకోమంటే ఆరోజు నేర్చుకోలేదు, ఈరోజు అనుభవిస్తున్నాను అనుకుంటుంది. మరోవైపు తోరణాలు కడదామని ప్రయత్నిస్తే గుమ్మం అందదు దివ్యకి. అక్కడ ఎవరు లేరు అనుకొని దివ్యని ఎత్తుకుంటాడు విక్రమ్. అది చూసిన బసవయ్య, రాజ్యలక్ష్మి కోపంతో ఊగిపోతారు.
 

Latest Videos


నువ్వు ఏవేవో ఆశలు పెట్టుకుంటున్నావు కానీ అవేవీ జరిగేటట్టుగా లేదు. చూడలేక మనం కళ్ళు మూసుకుంటున్నాం కానీ వాళ్ళు అస్సలు జంకటం లేదు అంటాడు బసవయ్య. కోపంతో దివ్య వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు. వాడికంటే లోకజ్ఞానం తెలీదు కనీసం నీకైనా జ్ఞానం ఉండాలి కదా.. పంతులుగారు పూజ పవిత్రంగా చేయాలన్నారు. ఇలాంటి సమయంలో వాడిని ముట్టుకోవచ్చా, వెళ్లి తల స్నానం చేసి రా అంటుంది రాజ్యలక్ష్మి. ఇప్పుడే చేశాను అత్తయ్య. కావాలంటే పసుపు నీళ్లు జల్లుకుంటాను అంటుంది దివ్య. అలా కుదరదు వెళ్లి స్నానం చేసి రా అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతుంది రాజ్యలక్ష్మి. భర్త వైపు జాలిగా చూస్తుంది దివ్య. 

ఇంత దూరం వెళుతుందని అనుకోలేదు అని ఫీల్ అవుతాడు విక్రమ్. మరోవైపు దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి రెడీ అవుతుంది తులసి. అనసూయ వాళ్ళని త్వరగా రమ్మని పిలుస్తుంది. ఈలోపు నందు కూడా వస్తాడు. నీకేనేంటి కంగారు నాకూ కంగారే అందుకే త్వరగా రెడీ అయిపోయాను అంటాడు. అంతలో అక్కడికి వచ్చిన అనసూయ.. ఎందుకు అంత కంగారు.. తాపీగా వెళ్దాము అంటుంది. మరీ పూజ టైం కి వెళ్తే బాగోదు ముందుగా వెళ్తే కాస్త హెల్ప్ చేయొచ్చు అంటుంది తులసి. దివ్యని వాళ్ల అత్తగారు రాచి రంపాన పెడతారని భయమా అంటూ వేళాకోళమాడుతుంది అనసూయ. అమ్మ.. అంటూ ఒక్క కేక పెడతాడు నందు. నేనేదో సరదాగా అన్నాను రా దానికే ఎందుకలా ఫీల్ అయిపోతావు అంటుంది అనసూయ. సరదాకి కూడా దివ్య కంట్లో కన్నీరు చూడలేను అంటూ కన్నీరు పెట్టుకుంటాడు నందు.
 

నువ్వు ఇలా బేలగా అయిపోతే నిన్ను చూసిన దివ్య మరింత దిగులు పడుతుంది. ధైర్యంగా ఉండు అంటాడు పరంధామయ్య. ఇంతలోనే లాస్య వచ్చి బయలుదేరుదామా అని అడుగుతుంది. అందరూ ఒక్కొక్కసారిగా షాక్ అవుతారు. అక్కడికి వస్తే నీ స్థానం మారిపోతుంది, మళ్లీ పెళ్లిలో గొడవ జరిగినట్లుగా జరుగుతుంది అంటుంది అనసూయ. ఎందుకు జరుగుతుంది తులసిని ఇంట్లో ఉండిపోమనండి అంటుంది లాస్య.
 

కుదరదు ఇంట్లో ఉండవలసింది నువ్వే. ఎందుకంటే దివ్య తల్లి తులసి కాబట్టి. అయినా మేము ఒక గంటలో మళ్ళీ వచ్చేస్తాము అప్పటివరకు శివ నామం జపించుకొని ఇంట్లో ఉండు అంటూ వెటకారంగా మాట్లాడి బయటికి నడుస్తుంది అనసూయ. ఆమె వెనకే పరంధామయ్య, తులసి దంపతులు కూడా బయలుదేరుతారు. నేను పిచ్చిదాని లాగా ఇంట్లో ఉండిపోవడం ఏంటి అంటూ ఇరిటేట్ అవుతుంది లాస్య.
 

తర్వాత లాస్య రాజ్యలక్ష్మి కి ఫోన్ చేసి ఆ ముసల్ది తులసిని నందుకి దగ్గర చేయాలని చూస్తుంది. అందుకే నన్ను తీసుకురాకుండా వదిలేశారు అంటూ నాకు ఒక చిన్న సాయం చేయాలి అని రాజ్యలక్ష్మిని అడుగుతుంది లాస్య. ఏంటో చెప్పు అంటుంది రాజ్యలక్ష్మి. మీ ఇంటికి వచ్చిన నందు వాళ్ళని బాగా అవమానించి పంపించు. అప్పటికి గానీ నా కడుపు మంట చల్లారదు అంటుంది  లాస్య. మీ గొడవల్లోకి నన్ను లాగొద్దు అంటుంది రాజ్యలక్ష్మి.
 

నేను నీకు ఎంత సాయం చేశాను. ఆ మాత్రం కృతజ్ఞత లేదా అంటుంది లాస్య. డబ్బులు తీసుకుని చేసేదాన్ని సాయం అనరు కూలి పని అంటారు అంటుంది రాజ్యలక్ష్మి. ఏదైతేనేమి మనిద్దరం ఐకమత్యంగా ఉంటే ఇద్దరికీ లాభమే అనటంతో రాజ్యలక్ష్మి సాయం చేయటానికి ఒప్పుకుంటుంది. తరువాత పూజ దగ్గర సర్దుతున్న దివ్యని ఆ పని చేయు, ఈ పని చెయ్యు అంటూ సతాయిస్తూ ఉంటారు బసవయ్య భార్య, రాజ్యలక్ష్మి.
 

నాకు ఏ పని చేత కావట్లేదు అంటూ బాధపడుతుంది దివ్య. తరువాయి భాగంలో ఇంటికి వచ్చిన తల్లిని పట్టుకొని కన్నీరు పెట్టుకుంటుంది దివ్య. కంగారుగా ఏమైంది అని అడుగుతుంది తులసి. ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ కంగారుగా ప్రశ్నిస్తాడు నందు. రాజ్యలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది.

click me!