బిగ్ బాస్ ఒక ఎర మాత్రమే.. శివాజీ గాలానికి ఆ పెద్ద చేప చిక్కుతుందా, మామూలు టార్గెట్ కాదు

First Published Jan 4, 2024, 5:32 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 7 ఎంతటి వినోదాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీజన్ 7 అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఫినాలే ముగిసిన తర్వాత కూడా ఆడియన్స్ బిగ్ బాస్ ని మరచిపోవడం లేదు. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 7 ఎంతటి వినోదాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీజన్ 7 అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఫినాలే ముగిసిన తర్వాత కూడా ఆడియన్స్ బిగ్ బాస్ ని మరచిపోవడం లేదు. పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన వివాదాలే అందుకు కారణం. మరో వైపు శివాజీ కెరీర్ లో కూడా మునుపటి జోష్ వచ్చేసింది. 

శివాజీ హౌస్ నుంచి బయటకి వచ్చాక ఆయన నటించిన 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటివి విన్ ఓటిటిలో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో శివాజీ వరుసగా యూట్యూబ్ ఛానల్స్ లో, టివి ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో శివాజీ ముగ్గురు పిల్లల తండ్రిగా టీచర్ గా నటిస్తున్నారు. 

Latest Videos


బిగ్ బాస్ తో ఈ రేంజ్ పబ్లిసిటీ కొట్టేసింది శివాజీ మాత్రమే అని చెప్పొచ్చు. శివాజీ బిగ్ బాస్ షోతో శివన్నగా మారిపోయాడు. బిగ్ బాస్ షోలో చాలా మంది కంటెస్టెంట్స్ శివాజీని శివన్నగా అభివర్ణించారు. దాదాపు 90 సినిమాల్లో నటించిన శివాజీకి ప్రత్యేకంగా పబ్లిసిటీ అవసరం లేదు. కానీ బిగ్ బాస్ వల్ల శివాజీకి లభించిన పబ్లిసిటీ వేరు.. అతడి ఇమేజ్ మారింది. 

శివన్న అనే తరహాలో పెద్ద వాడిగా ఎలివేషన్ వచ్చింది. పల్లవి ప్రశాంత్, యావర్ ల వెనక ఉండి నడిపించింది శివాజీనే అనే గుర్తింపు వచ్చింది. రాజకీయాల పట్ల శివాజీకి ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. శివాజీకి తెలుగుదేశం సానుభూతి పరుడనే గుర్తింపు ఉంది. 

శివాజీకి బిగ్ బాస్ లో పాల్గొనాల్సిన అవసరం లేదు. కానీ బిగ్ బాస్ షోని ఒక ఎరగా ఉపయోగించుకున్న శివాజీ పాలిటికల్ గా మైలేజ్ పొందుతున్నాడు అనే చర్చ కూడా లేకపోలేదు. శివాజీ గుంటూరుకి చెందిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. మీడియాలో కూడా మంచి ఎలివేషన్ ఇస్తున్నారు. గట్టిగా ట్రై చేస్తే ఎమ్మెల్య్యే టికెట్ సాధించడం.. పోటీ చేసి గెలవడం కూడా సాధ్యపడొచ్చు. శివాజీ అసలు టార్గెట్ ఎమ్మెల్యే పదవే అని అంటున్నారు. 

అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. శివాజీ మాత్రం తనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. ఏ పదవి వద్దని చెబుతున్నాడు. గతంలో పోసాని కృష్ణమురళి లాంటి నటుడు కూడా తనకు ఏ పదవి వద్దు అంటూనే వైసిపి సానుభూతి పరుడిగా జగన్ ఇచ్చిన పదవిని స్వీకరించారు. బిగ్ బాస్ ఎరతో శివాజీ టార్గెట్ చేసిన పెద్ద చేప రాజకీయాలే అనేది బలంగా వినిపిస్తున్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

click me!