సెక్స్ సీన్స్ చేయటంపై అవికా గోర్ బోల్డ్ కామెంట్స్... బాబోయ్‌ ఇలా

First Published Jun 15, 2024, 1:42 PM IST

 కొన్ని సినిమాల్లో రెచ్చిపోయి కాలంతో పాటు తను మారాలని ముద్దు సీన్స్, టైట్ హగ్స్, చివరకి  సెక్స్ సీన్లలో నటించింది. ఈ సీన్లు చేయడం ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందన్న...

‘బాలికా వధు’ టీవీ సీరియల్  ఎంతో పెద్ద హిట్ అయ్యి అప్పట్లో సెన్సేషన్. ఆ సీరియల్ తెలుగు అనువాదం ‘చిన్నారి పెళ్ళికూతురు’తో మనవాళ్ళకు బాగా చేరువై పోయింది అవికా గోర్.  ఈ క్రమంలో ఆమెకు సినిమాల నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఆమె హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం ‘ఉయ్యాల జంపాల’ చక్కని విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తన తొలి సిని హీరో రాజ్ తరుణ్ తో చేసిన సినిమా చూపిస్తా మామా పెద్ద హిట్. ఆ తర్వాత అవికా వెనుదిగిరి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

 ‘సినిమా చూపిస్త మావా’ తర్వాత కొద్ది గ్యాప్ తర్వాత వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం సక్సెస్ సాధించింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుంది. ఇప్పటికీ అవికా గోర్ చేతిలో దాదాపు ఏడెనిమిది సినిమాలు ఉన్నాయి. అందులో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలే ఆరు కావడం విశేషం. వాటిలో కొన్ని సినిమాలకు అవికా గోర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

Latest Videos


తెలుగులో తన మొదటి సినిమా ‘ఉయ్యాల జంపాల’ ఇంపాక్ట్ ఇప్పటికీ తన కెరీర్‌ మీద ఉందని అవికా అన్నారు. ఆ సినిమా వల్లే తనకు మరిన్ని ప్రాజెక్ట్స్ తెలుగులో చేసే అవకాశం తనకు వచ్చిందన్నారు. ఇటీవల ‘పాప్ కార్న్’ అనే సినిమాకు తాను నిర్మాతగా కూడా మారానని చెప్పారు. ఆ సినిమా తన కెరీర్‌లో ఎంతో స్పెషల్‌గా నిలుస్తుందన్నారు. తన వద్దకు ఎక్కువగా సస్పెన్స్, థ్రిల్లర్ సబ్జెక్లులే వస్తున్నాయని.. మంచి లవ్ స్టోరీలు వచ్చినా చేస్తానని అవికా స్పష్టం చేశారు. నటిగా తనకు ఒకే జానర్‌లో కొనసాగాలని లేదన్నారు. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా ఒక సినిమా చేస్తున్నానని.. అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయని వెల్లడించారు.

అలాగే సినిమాల్లోనే కాకుండా ఓటీటీ ఒరిజినల్స్, వెబ్ సిరీస్‌ల్లో కూడా అవికా గోర్ నటిస్తున్నారు. ఆమె తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘వధువు’. నందు, అలీ రెజాతో కలిసి అవికా గోర్ నటించారు. చిన్నప్పుడే నటిగా మారడం వల్ల త్వరగా అన్ని విషయాలు నేర్చుకోగలిగా. నటిగా మారడం వల్ల నా వ్యక్తిగత జీవితంలో సమయాన్ని కోల్పోయినా.. నటిగా నేను ప్రతి రోజూ ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నాను. ప్రతి రోజూ ఒక కొత్త లైఫ్ చూస్తున్నా’ అని అవికా ఆనందం వ్యక్తం చేశారు.
 

Avika Gor

ఇక తెరపై  ఎంతో క్యూట్ గా, పద్ధతిగా సంప్రదాయానికి బ్రాండ్ అంబాసిడర్ లా  ఉండే పాత్రలకే మొదట్లో పరిమితమైన ఆమె.. తర్వాత కొన్ని సినిమాల్లో రెచ్చిపోయి కాలంతో పాటు తను మారాలని ముద్దు సీన్స్, టైట్ హగ్స్, చివరకి  సెక్స్ సీన్లలో నటించింది. ఈ సీన్లు చేయడం ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందన్న ప్రశ్నకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది.
 

అవికా గోర్ ఈ మధ్య హాటర్‌ఫ్లై అనే బాలీవుడ్ సైట్ కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వూలో ఇంటిమేట్ సీన్లు చేయడంతోపాటు తన బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చంద్వానీతో రిలేషన్షిప్ లాంటి వాటిపై స్పందించింది. ఏడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే టీవీ సీరియల్ తో బిజీగా మారిన ఆమె.. తర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేసింది. గతేడాది వచ్చిన 1920 అనే హారర్ మూవీలో ఆమె చాలా హాట్ హాట్ సీన్స్ చేసింది.
 

  1920  సినిమాలో శృంగార సీన్స్  గురించి ప్రశ్నించగా.. ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చింది.. ” సె*క్స్ సీన్స్ చేయడం సరదాగా ఉంటుందని భావిస్తారు కానీ.. అవి చాలా బోరింగ్ గా ఉంటాయి. అయితే ఇలాంటి సీన్స్ తనతో పాటు.. మిగతా వారు కూడా ఫ్రీ గా చేయడానికి కారణం.. కోఆర్డినేటర్ కృష్ణా భట్. కృష్ణా భట్ చాలా ప్రొఫెషనల్.. ఆమె ఇమ్రాన్ హష్మి సినిమాలకూ పని చేసిన అనుభవంతోనే .. సెట్స్ లో చాలా మంది యాక్టర్స్ ఫ్రీ గా ఇలాంటి సీన్స్ చేస్తారు.” అంటూ చెప్పుకొచ్చింది అవికా.
 

 తాను చేసిన ఇంటిమేట్ సీన్లలో ఎక్కడా న్యూడిటీ కనిపించదని, నటీనటులు ఇలాంటి సీన్లు చేయడానికి ఎలా ఫీలవుతారో అర్థం చేసుకోవడం ముఖ్యమని ఆమె చెప్పింది. "లవ్ మేకింగ్ సీన్లలాంటివి అన్నీ ఉంటాయి. కానీ చాలా వరకు నా శరీరం ఎక్కడా బయటకు కనిపించదు. డైరెక్టర్లు అలా చూపిస్తారు. దీనికి సంబంధించిన చర్చ ఎంతో ముందుగానే జరిగిపోతుంది" అని అవికా తెలిపింది. ఇక సహచర నటులు కూడా తనను టచ్ చేసే సమయంలోనూ తన అనుమతి అడుగుతారని ఆమె చెప్పడం విశేషం.

డైరెక్టర్ విక్రమ్ భట్ గురించి మాట్లాడుతూ.. తమకంటే ఎక్కువగా ఆయనే సిగ్గు పడతారని మాట్లాడుతూ.. “విక్రమ్ సర్ ఓ ప్రొఫెషనల్. సెట్స్ లో ఎవరైనా ఎక్కువగా సిగ్గు పడతారంటే అది మా కంటే ఆయనే ఎక్కువ. చాలాసార్లు ఆయన ఇలాంటి సీన్లతో కాస్త ఇబ్బందిగా ఫీలవుతారు. అలాంటి టీమ్ తో కలిసి పని చేసినప్పుడు ఇలాంటి సీన్లు చేయడం కూడా సులువు అవుతుంది. ఏది అవసరమో అది చేస్తున్నామనే ఫీలింగ్ తప్ప మరొకటి ఉండదు. ఇక లవ్ మేకింగ్ సీన్లలాంటివి అన్నీ ఉంటాయి. కానీ చాలా వరకు నా శరీరం ఎక్కడా బయటకు కనిపించదు. డైరెక్టర్లు అలా చూపిస్తారు. దీనికి సంబంధించిన చర్చ ఎంతో ముందుగానే జరిగిపోతుంది” అంటూ అవికా గోర్ చెప్పుకొచ్చింది. 
 

తాను ధరించిన వైట్ జాకెట్ ఓపెన్ చేయడంతో అవికా బిగుతైన సొగసు నెటిజన్లకు కనువిందు చేస్తోంది. ఈ ఫోటోలకు అవికా గోర్ హ్యాపీ సండే అంటూ కామెంట్ పెట్టింది. 

కానీ ఇప్పుడు మాత్రం అవికా తనలోని కొత్త యాంగిల్ ని బయట పెట్టింది. క్యూట్ గానే కాదు మతిపోగోట్టే హాట్ నెస్ తో కూడా అవికా కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంటోంది. సినిమాల్లో గ్లామర్ రోల్స్ కి కూడా తాను సిద్దమే అన్నట్లుగా అవికా సంకేతాలు పంపుతోంది. 
గత కొన్ని ఏళ్లుగా మిలింద్ చాంద్వానీ అనే వ్యక్తితో ఆమె డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అతడితో రిలేషన్‌షిప్ మొదలుపెట్టిన కొంతకాలానికే తన ఆటిట్యూడ్ మారిందని అవికా చెప్పింది.

జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను అభిమానులకు తెలిపింది. మిలింద్ చాంద్వానీతో రిలేషన్ షిప్ మొదలుపెట్టిన కొంత కాలానికే తనలో ఆత్మ విశ్వాసం పెరిగిందని అవిగా గోర్ తెలిపింది. తన శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా ఎన్నో విషయాలు చెప్పాడని స్పష్టం చేసింది. మిలింద్ తన జీవితంలోకి ప్రవేశించిన అనంతరమే మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటున్నానని అంటోంది.  ఇప్పుడిప్పుడే అవికా గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. వెండితెరపై గ్లామర్ గా కనిపించడం ఎంత అవసరమో గుర్తించింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో వరుసగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లని ఊరిస్తోంది. 

click me!