మోహన్ బాబు ఇంట్లో దొంగతనం, భారీ మొత్తమే

By Surya PrakashFirst Published Sep 25, 2024, 4:39 PM IST
Highlights

హైదరాబాద్ శివారులోని జల్ పల్లి‌లో ఉన్న మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది ఆయన ఇంట్లో పని చేస్తున్న..


సీనియర్ నటుడు , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో పని చేస్తున్న వ్యక్తే దొంగతనం చేశాడని సమాచారం. హైదరాబాద్ శివారులోని జల్ పల్లి‌లో ఉన్న మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది ఆయన ఇంట్లో పని చేస్తున్న గణేష్ నాయక్ అనే వ్యక్తి డబ్బును దొంగిలించాడు. రూ. 10 లక్షల రూపాయిల డబ్బును దొంగలించి పారిపోయాడని తెలుస్తోంది.  దొంగతనం జరగడంతో మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు పట్టుబడ్డాడు.

మోహన్ బాబు ఇంట్లో ఎన్నో ఏళ్లుగా గణేశ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఆ వ్యక్తే దొంగతనానికి పాల్పడ్డాడు. మోహన్ బాబు వద్ద నమ్మకంగా ఉంటూనే చోరీ చేసేందుకు గణేశ్ ప్లాన్  వేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రూ. 10 లక్షల రూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత గణేశ్ కనిపించలేదు. అనుమానం వచ్చి చూడగా రూ. 10 లక్షలు మాయమైనట్టు అర్దమై వెంటనే పోలీస్ లను సంప్రదించారు.  

Latest Videos

 పహాడిషరీఫ్ పోలీసులకు మోహన్ బాబు మేనేజర్ కిరణ్ తేజ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... గణేశ్ కోసం గాలించారు.  తిరుపతిలో ఇవాళ ఉదయం మోహన్ బాబు ఇంటి పనిమనిషి(ఎవరైతే దొంగతనం చేశాడో) నాయక్ ను పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. ప్రస్తుతం అతన్ని హైదరాబాద్ కి తరలిస్తున్నారు.
 
 మోహన్ బాబు ప్రస్తుతం కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాను నిర్మిస్తున్నారు కూడా.. ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు. హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో పాటు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

click me!