10వ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఛైర్మన్‌గా అశుతోష్ గోవారికరే

By Mahesh JujjuriFirst Published Sep 24, 2024, 9:13 PM IST
Highlights

అట్టహాసంగా జరగబోయే 10వ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు   ఛైర్మన్‌గా అశుతోష్ గోవారికరే నియమించబడ్డారు. 

లగాన్, స్వదేశ్, జోధా అక్బర్, పానిపట్ వంటి ఆస్కార్-నామినేట్ సినిమాను నిర్మించిన బాలీవుడ్ నిర్మాత.. అశుతోష్ గోవారికర్ 10వ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్  గౌరవ ఛైర్మన్‌గా ప్రకటించారు.

జనవరి 15 నుండి 19, 2025 వరకు ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ  10వ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ను నిర్వహంచబోతున్నారు. ఈ ఈవెంట్స్ కు సంబంధించిన షెడ్యూల్స్ ను ఇప్పటికే కంప్లీట్ చేశారు. అంతే కాదు ఈవెంట్ కు సబంధించిన కమిటీ  రీసెంట్ గా  దాని లైనప్‌ను ఆవిష్కరించింది. ఈ టీమ్ లో  గోవారికర్ తో పాటు సునీల్ సుక్తాంకర్ వంటి ప్రముఖులు ఉన్నారు.

Latest Videos

AIFFని మరాఠ్వాడా ఆర్ట్, కల్చర్ తో పాటు  ఫిల్మ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తుంది. అంతే కాదు నాథ్ గ్రూప్, MGM విశ్వవిద్యాలయం, యశ్వంతరావు చవాన్ సెంటర్ ఈ ఈవెంట్స్ ను  సమర్పిస్తుంది. ఇది FIPRESCI, FFSI వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుండి ఆమోదాలను కూడా పొందింది.  అంతే కాదు సమాచార  ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందింది.

AIFF ఫౌండర్ ఛైర్మెన్ నందకిషోర్ కాగ్లీవాల్ తో పాటు చీఫ్ మెంటర్ అంకుష్రావ్ కదమ్ నేతృత్వంలోని ఆర్గనైజింగ్ కమిటీ  అశుతోష్ ను 10వ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఛైర్మన్ గా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. ఇక అశుతోష్ గురించి చూస్తే.. ఆయన రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా భారతీయ సినిమాకు ఎంతో సేవ చేశారు. 

అశుతోష్ గోవారికర్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ సర్క్యూట్‌లో కూడా తనదైన ముద్ర వేశారు. అంతే కాదు అతను ఆస్కార్ అవార్డులను అందించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో ఓటింగ్ సభ్యుడు. గోవారికర్ ఈ గౌరవం దక్కడంపై తన స్పందన తెలియజేశారు. ఆయన ఏమన్నారంటే..?  AIFF 10 సంవత్సరాల ఈ ఉత్సవాలకు  గౌరవాధ్యక్షుని పాత్రను చేపట్టడం నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఫెస్టివల్‌లో నన్ను చాలా ఉత్తేజపరిచే విషయం  ఏమిటంటే, ఇందులో చురుగ్గా పాల్గొంటున్న ప్రముఖ దర్శకులు-చంద్రకాంత్ కులకర్ణి, జయప్రద్ దేశాయ్, జ్ఞానేష్ జోటింగ్ మరియు ఇప్పుడు సునీల్ సుక్తాంకర్ ఫెస్టివల్ డైరెక్టర్‌గా ఉన్నారు. 

ఈ ఉత్సవం.. ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్‌లో.. అద్భుతాలను చేస్తుంది. అంతే కాదు ఛత్రపతి శంభాజీ నగర్ లో ఉత్సవాన్ని నిర్వహించడం ఇంకా ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది అన్నారు. ఈ స్థలం..  గొప్ప చారిత్రక మూలాలు కలిగిన శక్తివంతమైన సాంస్కృతిక కేంద్రం, స్థానికంగా కూడా  ప్రతిభను పెంచడానికి, ప్రోత్సహించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది అన్నారు. 

click me!