120 కి.మీ దూరం 45కి తగ్గితే ..: జనసేన ఎంపీ బాలశౌరిది భలే ఐడియా

By Arun Kumar PFirst Published Sep 27, 2024, 10:45 PM IST
Highlights

తన ప్రజల చిరకాల కోరిక తీర్చేందుకు జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి పట్టువదలని విక్రమార్కుడిలా మారారు. మచిలీపట్నం ‌- రేపల్లే రైల్వే లైన్ ను సాధించేవరకు విశ్రమించేలా కనిపించడంలేదు. తాజాగా ఆయన కేేంద్ర రైల్వే మంత్రిని కలిసారు. 

మచిలీపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ను అభివవృద్ది పథకం నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషిచేస్తోంది... ఇందులో భాగంగానే జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా అలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్దికే కాదు తన సొంత నియోజకవర్గానికి ఎంతగానో ఉపయోగపడే మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ పూర్తయ్యేవరకు జనసేన ఎంపీ విశ్రమించేలా కనిపించడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఈ రైల్వే లైన్ కోసం కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు జరిపిన బాలశౌరి  తాజాగా మరోసారి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. 

కృష్ణా జిల్లా దివిసీమప్రాంత ప్రజల చిరకాల కోరిక ఈ మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్. తన ప్రజల కలను నిజం చేసేందుకు ఎంపీ బాలశౌరి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో ఓసారి కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఆయన తాజాగా మరోసారి కలిసారు. మరోసారి మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ నిర్మాణం ఆవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించిన రూట్‌మ్యాప్‌లను మంత్రికి వివరించి పలు వివరాలను అందజేశారు. 

Latest Videos

మచిలీపట్నం – రేపల్లె లైనుకు సంబంధించి సర్వే పనులను త్వరతగతిన పూర్తి చేయాలని ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రిని కోరారు. అలాగే డీపీఆర్‌ తయారు చేసే విధంగా చొరవచూపాలని ... ఈ దిశగా రైల్వే ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రిని ఎంపీ కోరారు. మచిలీపట్నం నుంచి రేపల్లెకు రైల్వే లైన్‌ దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న డిమాండ్ ... ఈ లైను ఏర్పాటు చేస్తే దివిసీమ ప్రజల చిరకాల కోరిక తీరుతుందని బాలశౌరి వివరించగా మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలగా స్పందించారు. 

 గత కొన్ని దశాబ్దాలుగా కృష్ణా జిల్లా ప్రజలు, దివిసీమ వాసులు ఈ రైల్వే లైన్‌ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారని ఎంపీ బాలశౌరి అన్నారు. వారి కలసాకారం అయ్యేలా తన వంతు కృషి చేస్తానని ఎంపీ చెప్పారు. అధికారులకు అన్ని విధాలుగా సహకారం అందజేసి రైల్వే లైన్‌ ఏర్పాటు కోసం చర్యలు చేపడతానని ఎంపీ బాలశౌరి అన్నారు. 

మచిలీపట్నం - రైపల్లే రైల్వే లైన్‌ ప్రయోజనాలు :

మచిలీపట్నం నుంచి వయా గుడివాడ, విజయవాడ, తెనాలి చేరుకోవాలంటే సుమారు 120 కిలో మీటర్లు ప్రయాణినించాలని ఎంపీ బాలశౌరి తెలిపారు. అదే మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైను ఏర్పాటు చేస్తే తెనాలి చేరుకోవడానికి చాలా దూరం తగ్గి సమయం కలిసి వస్తుందన్నారు. అక్కడి నుంచి చెన్నై, తిరుపతి, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సులువుగా ఉంటుందని ఎంపీ తెలిపారు. 

ప్రధానంగా విజయవాడ జంక్షన్ మీద ట్రాఫిక్ భారం పడకుండా ఉంటుందన్నారు. ప్రయాణికులే కాకుండా ముఖ్యంగా మత్య్ససంపద అయిన చేపలు, రొయ్యలు రవాణా చేసేందుకు సులువుగా ఉంటుందని ఎంపీ బాలశౌరి అన్నారు. త్వరలో పోర్టు నిర్మాణం కూడా పూర్తి కావస్తున్నందున ఈ రైల్వే లైన్‌ సరకు రవాణాకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.  

 సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి :

మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్‌ నిర్మాణం సాధ్యాసాధ్యాలను తెలుసుకుని కావలసిన వనరులు, ఇతర వివరాలు సేకరిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గతంలోని ఎంపీ బాలశౌరికి లేఖ రూపంలో తెలిపారు. త్వరితగతిన అధికారులకు ఆదేశాలు అందజేసి రైల్వే లైన్‌ ఏర్పాటు అంశంపై స్టడీ చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఈ రైల్వే లైన్‌ నిర్మాణంపై అధ్యయం చేస్తామని ఎంపీ బాలశౌరికి తెలియజేశారు. ఈక్రమంలో మరోసారి ఎంపీ బాలశౌరి కేంద్ర రైల్వే మంత్రితో భేటీ అయ్యి రైల్వే లైను నిర్మాణం అంశాన్ని మంత్రికి గుర్తు చేశారు. దీంతో రైల్వే లైన్‌ నిర్మాణంపై అధ్యయం చేసే పనులు అతి త్వరలోనే ప్రారంభం అవుతాయని ఎంపీ బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


 
 

click me!