ఎగ్జామ్స్ కి ముందు రోజు మీరు ఈ తప్పులు అస్సలు చేయొద్దు 

First Published | Sep 27, 2024, 8:39 PM IST

ఎంత చదివామన్నది ముఖ్యం కాదు. ఎగ్జామ్స్ లో ఎంత బాగా రాసామన్నదే ముఖ్యం. ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ముందు రోజు మీరు ఈ 10 తప్పులు అస్సలు చేయొద్దు.  
 

ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్కులు ఎక్కువ వస్తేనే టాలెంట్ ఉన్నట్లు లెక్క. మరి మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలంటే బాగా చదవాలి. అంతేనా చదివింది పరీక్షల్లో బాగా రాయాలి. చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ముందు వరకు సరిగ్గా చదవకుండా కేవలం నాలుగైదు రోజుల ముందు నుంచి పగలు, రాత్రి రెస్ట్ లేకుండా చదివేస్తుంటారు. నిజానికి ఇలా చేయడం వల్ల పరీక్షల్లో సరిగా పర్ఫామ్ చేయలేమని నిపుణులు చెబుతున్నారు. మరి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే, ముఖ్యంగా ముందు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. 
 

రాత్రంతా చదవద్దు
చాలా మంది చేసే తప్పు ఇది. కరెక్ట్ గా పరీక్షకు ముందు రోజు ఎక్కువ గంటలు కంటిన్యూగా చదివేస్తారు. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా పరీక్షకు ముందు రోజు చాలా మంది నైట్ అవుట్ చేస్తుంటారు. ఇలా చదవడం మంచిది కాదు. దీని వల్ల ఎగ్జామ్ రాసే సమయంలో నీరసం వస్తుంది. దీంతో మీరు ఎంత చదివినా పరీక్షలో బాగా రాయలేరు.  

రాత్రి నిద్ర లేకపోతే కష్టమే
తగినంత నిద్ర లేకపోతే మీరు ఎంత చదివినా మీ మెదడు రిసీవ్ చేసుకోదు. బ్రెయిన్ సరిగా వర్క్ చేయకపోతే మీరు చదివిన లెసన్స్ సమయానికి గుర్తురావు. దీంతో మీరు శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే పరీక్షకు ముందు సరైన విశ్రాంతి అవసరం.
 


కొత్త టాపిక్‌లు చదవద్దు
చాలా మంది ఎగ్జామ్ దగ్గర పడుతుండగా కొత్త టాపిక్ లు చదువుతుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎగ్జామ్ కు ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. పైగా నష్టమే ఎక్కువ ఉంటుంది. కొత్త టాపిక్ లు గుర్తుండకపోగా, ఇప్పటికే నేర్చుకున్నటాపిక్స్ మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే పాత లెసన్స్ రివైజ్ చేయడమే మంచిది.

సోషల్ మీడియాను వదిలేయండి
చాలామంది ఎగ్జామ్ టెన్షన్ నుంచి బయటపడటానికి సోషల్ మీడియా లేదా ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్ చూస్తుంటారు. వీటికి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల చదువుపై దృష్టి పోతుంది. ముఖ్యంగా ఎగ్జామ్ కు ముందు రోజు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. 
 

ఒత్తిడి పడొద్దు
పరీక్ష గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. ఇది మీరు ఎగ్జామ్ లో పర్ఫామెన్స్ చేసే విషయంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువ టెన్షన్ పడటం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎగ్జామ్స్ సరిగా రాయలేరు. రిలాక్స్ గా ఉండటం వల్ల చదివిన టాపిక్స్ గుర్తుకు వచ్చి పరీక్ష బాగా రాయగలుగుతారు. 

జంక్ ఫుడ్ తినద్దు 
జంక్ ఫుడ్, అతి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా పరీక్షల టైమ్ లో మీరు తీసుకొనే ఫుడ్ మంచిదై ఉండాలి. హెల్త్ పాడైతే ఆ ప్రభావం ఎగ్జామ్ పై పడుతుంది. ఇది మీ ఏకాగ్రతను తగ్గిస్తుంది.
 

గ్యాప్ లేకుండా చదవద్దు
చదివేటప్పుడు మధ్యలో కాస్త విశ్రాంతి  తీసుకొని చదవడం మంచిది. దీని వల్ల మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. గ్యాప్ తీసుకోకపోతే మీరు అలసిపోతారు. 

కాఫీ, టీలు తాగకండి
కొంతమంది ఏకాగ్రత కోసం ఎక్కువ కాఫీ, టీలు తాగుతారు. ఇది మామూలు రోజుల్లో పర్లేదు కాని ఎగ్జామ్ ముందు రోజు చేస్తే మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎగ్జామ్ ముందు రోజు మీరు ఎంత రిలాక్స్ గా ఉంటే అంత మంచిది.

చిన్న నోట్స్ రాసుకోండి
ఎగ్జామ్ ముందు రోజు కొత్త టాపిక్స్ చదవడం కంటే అప్పటికే చదివిన లెసన్స్ పై చిన్న చిన్న నోట్స్ రాసుకోవడం మంచిది. దీని వల్ల సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. 
 

Latest Videos

click me!