నష్ట నివారణ చర్యల్లో భాగంగా 'దేవర' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. ఇదైనా బజ్ పెంచుతుందా..

By tirumala AN  |  First Published Sep 22, 2024, 2:38 PM IST

ట్రైలర్ లో చూపిన సన్నివేశాల్లో సముద్రం బ్యాక్ డ్రాప్ తప్ప మిగిలిన తండ్రి కొడుకుల కథ అంతా రొటీన్ గానే అనిపిస్తున్నట్లు కామెంట్స్ వచ్చాయి. దీనితో దేవర చిత్ర యూనిట్ నష్ట నివారణ చర్యల్లో భాగంగా రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది. దాదాపు 2 నిమిషాల నిడివితో రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. 


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం మరికొద్ది రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇండియా మొత్తం తిరుగుతూ ఎన్టీఆర్, కొరటాల శివ, ఇతర చిత్ర యూనిట్ దేవర చిత్రానికి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. 

కానీ మైండ్ బ్లోయింగ్ అనిపించే స్థాయిలో లేవనే చిన్న నిరాశ ఉంది. ఎందుకంటే దేవర చిత్రం సాధారణంగా తెలుగులో రిలీజ్ అవుతున్న చిత్రం కాదు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం. అలాంటప్పుడు అంచనాలు, బజ్ ఎలా ఉండాలి ? టాప్ లేచిపోయేలా ఒక రేంజ్ లో హంగామా ఉండాలి. కానీ ఆ స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు. దీనికి ప్రధాన కారణంగా అంతా చెబుతున్నది ఒక్కటే.. ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేదని. 

Latest Videos

undefined

ట్రైలర్ లో చూపిన సన్నివేశాల్లో సముద్రం బ్యాక్ డ్రాప్ తప్ప మిగిలిన తండ్రి కొడుకుల కథ అంతా రొటీన్ గానే అనిపిస్తున్నట్లు కామెంట్స్ వచ్చాయి. థ్రిల్ చేసేలా, సినిమాపై ఆసక్తిని పెంచేలా ట్రైలర్ లేదు. దీనితో దేవర చిత్ర యూనిట్ నష్ట నివారణ చర్యల్లో భాగంగా రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది. దాదాపు 2 నిమిషాల నిడివితో రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. 

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'నిన్న రేత్రో పీడకల వచ్చివుండాది జోగుల.. సముద్రం ఎరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్లు.. అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించి ఉండాది అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ సముద్రం ఒడ్డున రక్తపాతం సృష్టించిన దృశ్యాలు చూపించారు. అదే విధంగా ఎన్టీఆర్ నిద్రలో ఉల్లిక్కి పడి లేవడం కూడా చూడొచ్చు. సముద్రంలో జరిగియే స్మగ్లింగ్ దృశ్యాలు కూడా చూపించారు. 

 

భయం పోవాలంటే దేవుడి కథ వినాలి.. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో కూడా డైలాగులు వినిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ లో కూడా జాన్వీ కపూర్ కి ఒక్క డైలాగ్ మాత్రమే దొరికింది. దేవర కొడుకు గా ఎన్టీఆర్ పిరికివాడిగా మొదటి ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ లో మాత్రం ఎన్టీఆర్ విరుచుపడుతున్నాడు. సముద్రంలో షార్క్ సన్నివేశాన్ని కూడా చూపించారు. షార్క్ తో ఎన్టీఆర్ పోరాడుతూ దానిని తన అదుపులోకి తెచ్చుకుంటున్నాడు. 

Also Read: భార్య పిల్లలని పోషించడానికి చిల్లిగవ్వ లేదు, శోభన్ బాబు ఏం చేశారో తెలుసా.. సూపర్ హిట్ తర్వాత కూడా దుస్థితి

ఓవరాల్ గా రిలీజ్ ట్రైలర్ బాగానే ఉంది. అయితే ఈ ట్రైలర్ బజ్ ని పెంచేందుకు ఉపయోగపడుతుందా లేదా అనేది చూడాలి. దేవర చిత్రానికి ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. అక్కడ ఎలాంటి సమస్య లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పాన్ ఇండియా చిత్రానికి ఉండవలసిన బజ్ లేదు. మొదటి ట్రైలర్ లో కథ తెలిసిపోయింది. దీనికి తోడు ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేసిన ఆంధ్రవాలా ఛాయలు ఉన్నాయనే కామెంట్స్ కూడా వచ్చాయి. అందుకే జరిగిన నష్టాన్ని నివారించేందుకు రిలీజ్ ట్రైలర్ తీసుకువచ్చారు. 

click me!