మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మూడేళ్ళుగా ఈ సినిమా సాగుతున్నా ఒక సాంగ్, ఒక పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఇన్నాళ్లు ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక తాజాగా ఈమూవీ నుంచి సాలిడ్ సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
మెగాపవర్ స్టార్.. గ్లోబల్ హీరో రాంచరణ్ నటిస్తున్నసినిమా 'గేమ్ ఛేంజర్. ఈమూవీ నుంచి సాలిడ్ అప్ డేట్ కోసం చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. సినిమా దాదాపు మూడేళ్లుగా నాచ్చుతున్నాడు శంకర్ .. కనీసం అప్ డేట్స్ అయినా ఇస్తాడేమో అని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. దాంతో ఈ మూవీనుంచి అప్ డేట్ ను ప్రకటించారు టీమ్.
ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను ఈనెలలోనే రిలీజ్ చేస్తామని టీమ్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. ఇంతక ముందు రామ్ చరణ్ డాన్స్ చేస్తున్నట్టు ఉన్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా సాంగ్ పేరును కూడా ప్రకటించారు. రా మచ్చ మచ్చా సాంగ్ ను త్వరలో రిలీజ్ చేయబోతున్నామంటూ ప్రకటించారు టీమ్.
ఇటీవల ఈ సినిమాని క్రిస్మస్ కి రిలీజ్ చేస్తామని దిల్ రాజు ప్రకటించారు. అప్పట్నుంచి గేమ్ ఛేంజర్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక కొద్దికాలంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొన్ని రోజుల నుంచి వరుసగా గేమ్ ఛేంజర్ అప్డేట్స్ అంటూ హడావిడి చేస్తుండటంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక రెండో పాటకు సబంధించిన అప్ డేట్ ఇస్తూ..అది వచ్చే సమయం అయింది. బ్లాస్ట్ కి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ చేసారు మూవీ యూనిట్.
ఈసినిమా స్టార్ట్ అయ్యి మూడేళ్ళకకు పైనే అవుతుంది. కాని ఇంత వరకూ షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంతో.. చరణ్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. మధ్యలో ఈసినిమా దర్శకుడు శంకర్ కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా కోసం చరణ్ సినిమాను నిర్లక్ష్యం చేశాడు అని మొదటి నుంచి మండిపడుతూ వచ్చారు.
ఇండియన్2 రిలీజ్ అయ్యి ప్లాప్ అయిన తరువాత కూడా రామ్ చరణ్ మూవీపై జాగ్రత్తలు పాటించడంలేదు అనికూడా ప్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ తరువాత సంగతి.. మూవీకి సబంధించి ఏ అప్డేట్ ఇవ్వక పోవడంపై కూడా గుస్సాగా ఉన్నారు మెగా అభిమానులు.
గతంలో కూడా మూవీ టీమ్ పై ఇలాగే ప్రెజర్ తెస్తే.. ఏవో పోస్టర్లతో పాటు.. ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు గేమం చేంజర్ టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై 'జరగండి' సాంగ్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. తొలి సాంగ్ పై ఫ్యాన్స్ నుంచే విమర్షలు వచ్చాయి. మరి ఈ సెకండ్ సాంగ్ ఎలా ఉంటుంది.. అసలు సినిమా ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.