యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు. దేవర సినిమాతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.. భారీ సినిమాలతో పెద్ద స్టార్ గా నిలిచిన ఎన్టీఆర్.. ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉంటారు. తన ఫ్రెండ్స్ ను ఫ్యాన్స్ ను ఎప్పుడూ గౌరవిస్తూ.. వారిపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతారు.
శ్రీదేవికి అహంకారం ఎక్కువ.. జయప్రద కామెంట్స్
తాజాగా ఓ అభిమాని దేవర చూసి చనిపోవాలి అనుకుంటున్నాు అంటూ తారక్ ను వేడుకున్నాడు. క్యాన్సర్ తో పోరాడుతున్న ఆ వ్యక్తితో వీడియో కాల్ లో మాట్లాడి.. ధైర్యం అందించాడు తారక్. ఇక తాజాగా తనను కలవడానికి జపాన్ నుంచి వచ్చిన ఓ అభిమానిని నేరుగా కలిసి ఆప్యాయతతో పలకరించాడు.
ఇలా ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు సంతోషపెడుతూ.. కష్టసుఖాలలో కలిసి ఉంటాడు తారక్. ఇక ఎన్టీఆర్ గ్రూప్ లో చాలామంది ఫ్రెడ్స్ ఉన్నారు. రాజమౌళి, ఆయన తనయుడు, రామ్ చరణ్, రాజీవ్ కనకాల.. సమీర్.. ఇలా చాలామంది తరక్ గ్రూప్ లో ఉన్నారు.
వీరిలో రాజీవ్ కనకాలతో ఎన్టీఆర్ బంధం చిన్ననాటి నుంచి కొనసాగుతుంది. ఇద్దరు ప్రాణ మిత్రులుగా ఉంటారు. అయితే సినిమాల విషయంలో మాత్రం రాజీవ్.. ఎన్టీఆర్ కు ఇవ్వల్సిన గౌరవం ఇస్తుంటారు.
మెడలో గోల్డ్ చైను అమ్మి రజినీకాంత్ ను హీరోను చేసిన వ్యక్తి
ఇక ఎన్టీఆర్ ఫ్రెండ్స్ కు ఎంత విలువ ఇస్తాడు అనే విషయాన్ని ఓ ఉదాహరణతో వివరించాడు నటుడు రాజీవ్ కనకాల. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తారక్ తన ప్రెండ్స్ కు చాలా విలువ ఇస్తాడు. తనతో సమానంగా చూడాలి అనుకుంటాడు అన్నారు. ఇక రాజీవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే..?
ఓ సారి ఆంధ్రావాల సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ సెట్ లోనేను ఎన్టీఆర్, ఎమ్మెస్ గారు కూర్చున్నాము.. తారక్ ను పిలిచారు.. అందరు ఒక దగ్గరకు వెళ్తున్నారు. ఇక తారక్ నన్ను కూడా రమ్మన్నాడు. కాని నేను నువ్వు ముందు వెళ్ళు.. లేదా నేనన్న ముందు వెళ్తాను.. నీతో కలిసి వస్తే.. అక్కడ పరిస్థితి మారిపోతుంది.. అంత బాగోదు.. అని నేను అన్నాను.
మోహన్ బాబు పిచ్చోడు.. ఏఎన్నార్ కామెంట్స్ వెనుక రహస్యం
అయితే దానికి తారక్ మాట్లాడుతూ.. నువ్వు ప్రతీ దానికి నువ్వు ఇలానే ఏదో ఒకటి అంటావు.. ఏఉండదు.. ఎవరు ఏం అనరు రా అని నన్ను తీసుకెళ్ళాడు. అయితే పెద్ద నటులంతా ఒక దగ్గర ఉంటారు. అక్కడికి నేను వెళ్ళగానే.. ఒక సీనియర్ నటుడు.. నేను పేరు చెప్పను.. ఆయన వెంటనే నామీద సీనియర్ అయ్యాడు. మేమంతా సీనియర్లు.. నువ్వేంటి ఇక్కడా అన్నట్టు మాట్లాడా.
దానికి వెంటనే తారక్ అందుకుని.. దేనికి సీనియారిటీ అన్నా.. ఎందులో సీనియారిటీ.. వాడు ఎన్నేళ్ళుగా నటిస్తున్నాడో నీకుతెలుసా.. వాడి ఫ్యామిలీ హిస్టరీ నీకు తెలుసా..? దేనికి సీనియారిటీ.. అయినా వాడ్నినేనే తీసుకువచ్చాను.. నాతో పాటు.. అన్నారు. దాంతో హీరోనే ఆ మాట అనేసరికి.. సారి సారి బాబు అంటూ.. ఆ నటుడు కామ్ అయ్యాడు.
ఇలా ఎన్టీఆర్ తన కో ఆర్టిస్ట్ లలో ఎక్కవ తక్కువ చూడరు.. ఆయన మనసుకు నచ్చింది చేసుకంటూ వెళ్తారు అని అన్నారు రాజీవ్ కనకాల. దాంతో రాజీవ వీడియో వైరల్ అవుతోంది. అంతే కాదు ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తుతూ.. కామెంట్లు చేస్తున్నారు. తారక్ అన్న అంటే అది మరి.. ఎన్టీఆర్ తన ఫ్రెండ్స్ కు చాలా వాల్యూ ఇస్తారు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.