క్యూట్ ఫోజులతో అనసూయ కవ్వింపు.. క్లోజప్ పిక్స్ తో మైమరిపిస్తున్న రంగమ్మత్త.. ఫొటోలు

First Published | Sep 6, 2023, 1:06 PM IST

యాంకర్ నుంచి నటిగా మారిన అనసూయ భరద్వాజ్ వరుస చిత్రాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు పెడుతూ ఆకట్టుకుంటోంది. 
 

‘జబర్దస్త్’ యాంకర్ గా అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)  ఎంత పేరు సంపాదించుకున్నారో తెలిసిందే. బుల్లితెరపై యాంకర్ గానే అలరిస్తూనే మరోవైపు అందచందాలతో ఆడియెన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. తన డాన్స్ తో కట్టిపడేసింది. 
 

ఈ క్రమంలో సినిమాల్లోనూ అవకాశాలు అందుకొని నటిగా మారింది. తొలుత స్పెషల్ అపియరెన్స్ తో వెండితెరపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. క్రమంగా స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.  
 


‘రంగస్థలం’తో మంచి గుర్తింపు దక్కించుకుంది. రంగమ్మత్తగా నిలిచిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప’లో మాస్ రోల్ పోషించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రీసెంట్ గా వచ్చిన ‘రంగమార్తాండ’, ‘విమానం’ చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. ఇలా వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తూనే ఉంది. 
 

మరోవైపు బుల్లితెరకు దూరమైనప్పటి నుంచి తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారానే టచ్ లో ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ అందిస్తోంది. అలాగే ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. అదేవిధంగా గ్లామర్ ఫొటోలనూ పంచుకుంటూ మెస్మరైజ్ చేస్తోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ మరిన్ని క్యూట్ ఫొటోలను షేర్ చేసుకుంది. బ్లాక్ గౌన్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. నయా లుక్ లో మెరుపులు మెరిపించింది. అలాగే కొంటె ఫొజులతో కుర్ర హృదయాలను కట్టిపడేసింది.  క్లోజప్ లో కవ్వింపు చర్యలతో మంత్రమగ్ధులను చేసింది. 

లేటెస్ట్ ఫొటోలను ఫ్యాన్స్, నెటిజన్లు లైక్ చేస్తున్నారు. కామెంట్లతో అనసూయను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. మరింత ఎంకరేజ్ చేస్తూ ఫొటోలను వైరల్ గా మారుస్తున్నారు. ప్రస్తుతం అనసూయ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2 : ది రూల్’లో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Latest Videos

click me!