- Home
- Entertainment
- `కల్కి 2` నుంచి దీపికా పదుకొనె ఔట్? `స్పిరిట్` మూవీ ఎఫెక్ట్.. టీమ్ ఏం చెప్పిందంటే?
`కల్కి 2` నుంచి దీపికా పదుకొనె ఔట్? `స్పిరిట్` మూవీ ఎఫెక్ట్.. టీమ్ ఏం చెప్పిందంటే?
దీపికా పదుకొనె ఇటీవల ప్రభాస్ `స్పిరిట్` నుంచి తప్పుకుంది. దీంతో మరి డార్లింగ్ మరో మూవీ `కల్కి 2` నుంచి కూడా తప్పుకున్నట్టేనా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
`స్పిరిట్` నుంచి తప్పుకున్న దీపికా పదుకొనె
ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘స్పిరిట్’ సినిమా నుండి బయటకు వచ్చిన బాలీవుడ్ నటి దీపికా పదుకొనెకి ‘కల్కి 2’ సినిమా తలుపులు మూసుకుపోయాయా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రభాస్ కంటే ఎక్కవ స్టార్ డమ్
దీపికా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘ప్రభాస్ కంటే ఎక్కువ, ఆయనకి సమానంగా నా స్టార్ డమ్ ఉంది. అందుకే నేను ఆయన అంతే పారితోషికం ఆశిస్తున్నాను. `స్పిరిట్` సినిమా బృందం దీనికి అంగీకరించనప్పుడు ఆ బృందం నుండి బయటకు వచ్చాన’ని తెలిపింది దీపిక.
`కల్కి 2` నుంచి దీపికా పదుకొనె ఔట్?
అది ప్రభాస్ హీరోగా, దీపికా కథానాయికగా నటిస్తున్న ‘కల్కి 2’ సినిమా బృందం పై కూడా ప్రభావం చూపినట్లుంది. త్వరలోనే దీపికాను ఈ సినిమా నుండి కూడా తొలగించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
`కల్కి 2` టీమ్ రియాక్షన్ ఇదే
అయితే సినిమా వర్గాలు దీనిని ఖండించాయి. ఇంకా ఇప్పుడు ‘కల్కి 2’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులే ప్రారంభమయ్యాయి, దీపికాను తొలగించే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపాయి.
రూ.600కోట్లతో `కల్కి 2`
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న 'కల్కి2' చిత్రం సైన్స్ ఫిక్షన్, పౌరాణిక కథాంశంతో రూపొందుతోంది. ఇది వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.