- Home
- Entertainment
- విడిపోవడమే మంచిదైండి.. పేరెంట్స్ కమల్ హాసన్, సారిక విడాకులపై శృతి హాసన్ బోల్డ్ స్టేట్‌మెంట్
విడిపోవడమే మంచిదైండి.. పేరెంట్స్ కమల్ హాసన్, సారిక విడాకులపై శృతి హాసన్ బోల్డ్ స్టేట్‌మెంట్
తన తండ్రి కమల్ హాసన్‌తో తల్లి సారిక విడిపోవడంపై హీరోయిన్ శృతి హాసన్ స్పందించింది. తన తల్లినే తనకు ఇన్ స్పిరేషన్ అని తెలిపింది.

పేరెంట్స్ కమల్ హాసన్, సారిక విడాకులపై శృతి హాసన్ కామెంట్
శృతి హాసన్ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంది. ఇప్పుడు కొంత గ్యాప్ ఇచ్చింది. ఈ క్రమంలో శృతి హాసన్ తన పేరెంట్స్ గురించి రియాక్ట్ అయ్యింది. కమల్ హాసన్, సారికలు విడిపోయిన విషయం తెలిసిందే. దీనిపై శృతి హాసన్ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
బాధ కంటే ఇన్ స్పైర్ చేసిందంటూ శృతి కామెంట్
తండ్రి-తల్లి(కమల్, సారిక) విడిపోవడం తనకు బాధ కంటే, జీవితంలో ఒక విలువైన పాఠాన్ని నేర్పిందని, ముఖ్యంగా ఒక స్త్రీ ఆర్థికంగా, మానసికంగా స్వతంత్రంగా ఉండవలసిన అవసరాన్ని తెలియజేసిందని శృతి హాసన్ వెల్లడించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
విడిపోయినందుకు సంతోషించా
ఇందులో తల్లిదండ్రుల విడాకుల గురించి మాట్లాడుతూ, "నేను చిన్నగా ఉన్నప్పుడే వారు విడిపోయారు. నిజం చెప్పాలంటే, దానికి నేను బాధపడలేదు. బదులుగా వారు విడిపోవడానికి సంతోషించాను. ఎందుకంటే, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండలేనప్పుడు, బలవంతంగా ఒకే ఇంట్లో ఉండటంలో అర్థం లేదు. వారు కలిసి బాధపడటం కంటే, విడివిడిగా తమ జీవితాల్లో సంతోషంగా ఉండటం మంచిదని నేను భావించాను` అని తెలిపింది శృతి. ఇది ఆమె మెచ్యూరిటీని తెలియజేస్తుంది.
అమ్మ జీవితం నుంచి నేను నేర్చుకున్నది ఇదే
ఈ సందర్భంగా తాను నేర్చుకున్న అతిపెద్ద విషయం గురించి శృతి మాట్లాడుతూ, `విడాకుల తర్వాత నా తల్లి సారిక ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా నిలబడి తన జీవితాన్ని తిరిగి మలుచుకున్న తీరు, ఆర్థికంగా నిలబడిన తీరు నాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది.
ఆ సంఘటన ఒక స్త్రీ మానసికంగానే కాకుండా, ఆర్థికంగా కూడా స్వయం సమృద్ధిగా ఉండటం ఎంత ముఖ్యమో నాకు తెలియజేసింది. అది నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఇండిపెండెంట్‌గా బతకడం నేర్పించింది` అని తెలిపింది శృతి.
శృతి హాసన్ సినిమాలు
తండ్రి-తల్లి విడిపోవడం వారి వ్యక్తిగత సంతోషం కోసం తీసుకున్న నిర్ణయం, దానిని నేను గౌరవిస్తానని చెప్పింది శృతి హాసన్. పేరెంట్స్ విడిపోయినా, వారిద్దరితోనూ మంచి రిలేషన్ కొనసాగిస్తుంది. తరచూ తండ్రి కమల్ తో దిగిన ఫోటోలను పంచుకుంటుంది శృతి.
శృతి హాసన్ చివరగా తెలుగులో `సలార్`లో నటించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ లో ప్రభాస్ హీరోగా నటించారు. దీనికి సీక్వెల్ `సలార్ 2` రానుంది. ఇందులో శృతి హాసన్ పాత్ర మెయిన్‌గా ఉండబోతుందట. ప్రస్తుతం `కూలీ`, `ట్రైన్`, `జన నాయగన్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది శృతి హాసన్.