- Home
- Entertainment
- అక్షయ్ కుమార్ టాప్ 5 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు.. దుమ్ములేపుతున్న `హౌస్‌ఫుల్ 5`, ఎంత వచ్చాయంటే?
అక్షయ్ కుమార్ టాప్ 5 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు.. దుమ్ములేపుతున్న `హౌస్‌ఫుల్ 5`, ఎంత వచ్చాయంటే?
అక్షయ్ కుమార్ 'హౌస్‌ఫుల్ 5' సినిమా మూడో రోజు కలెక్షన్లతో కొత్త రికార్డ్ సృష్టించింది. ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన మూడో అతిపెద్ద వీకెండ్ ఓపెనింగ్ సినిమా ఇది. అక్షయ్ కుమార్ ఫస్ట్ వీక్ అత్యధిక వసూళ్లని రాబట్టిన టాప్ 5 మూవీస్ ఏంటో చూద్దాం.

5. సూర్యవంశీ (2021)
మొదటి వారాంతపు వసూళ్లు: రూ.77.08 కోట్ల రూపాయలు
రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాను రూపొందించిన కాప్ యూనివర్స్‌లో భాగం. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా టోటల్ కలెక్షన్లు 196 కోట్ల రూపాయలు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
4.కేసరి (2019)
మొదటి వారాంతపు వసూళ్లు: రూ.78.07 కోట్ల రూపాయలు
ఈ హిట్ చిత్రానికి 4 రోజుల వారాంతం లభించింది. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం టోటల్ గా 154.41 కోట్ల రూపాయలు రాబట్టింది.
3.హౌస్‌ఫుల్ 5 (2025)
మొదటి వారాంతపు వసూళ్లు: రూ.91.83 కోట్ల రూపాయలు
తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించిన ఈ చిత్రం అద్భుతంగా ప్రదర్శన కనబరుస్తోంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించగా, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ వంటి నటులు కూడా నటించారు. ఇది గత వారమే విడుదలయ్యింది.
2. 2.0 (2018)
మొదటి వారాంతపు వసూళ్లు: 97.25 కోట్ల రూపాయలు (హిందీ వెర్షన్ మాత్రమే)
ఈ సూపర్ హిట్ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్‌గా, రజనీకాంత్ హీరోగా నటించారు. ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ వెర్షన్ 189.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
1.మిషన్ మంగళ్ (2019)
మొదటి వారాంతపు వసూళ్లు: రూ.97.56 కోట్ల రూపాయలు
జగన్ శక్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సూపర్ హిట్ చిత్రం జీవితకాల వసూళ్లు 202.98 కోట్ల రూపాయలు.