నిమిషానికి రూ.4.35 కోట్లు తీసుకున్న హీరో ఎవరో తెలుసా? అది కూడా తెలుగు సినిమాకే
సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు సైతం గెస్ట్ లుగా మెరిసి కోట్లు సంపాదిస్తున్నారు. అలా గెస్ట్ గా చేసి అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో గురించి తెలుసుకుందాం.

అతిథి పాత్రలో మెరిసి అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో
సినిమా పరిశ్రమలో క్యామియో రోల్స్ చేసి సంపాదించడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఇంతకీ క్యామియో చేసి అత్యధికంగా సంపాదిస్తున్న హీరో ఎవరో తెలుసా? ఆ కథేంటో తెలుసుకుందాం.
అజయ్ దేవగన్ గెస్ట్ రోల్ చేసి కోట్లు సంపాదించారు
సినిమాల్లో క్యామియో చేసి అత్యధికంగా సంపాదిస్తున్న స్టార్స్ జాబితాలో అజయ్ దేవగన్ అగ్రస్థానంలో ఉన్నారు. అజయ్ ఒక సినిమాలో క్యామియో కోసం నిమిషానికి రూ. 4.35 కోట్లు వసూలు చేశారు.
`ఆర్‌ఆర్‌ఆర్` అతిథి పాత్రలో మెరిసిన అజయ్ దేవగన్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన `RRR` సినిమాలో అజయ్ దేవగన్ అతిథి పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఆయన కేవలం 6-8 నిమిషాలు కనిపించినప్పటికీ, భారీ పారితోషికం అందుకున్నారు.
గెస్ట్ రోల్ చేసి రూ.35కోట్ల పారితోషికం
2022లో విడుదలైన `RRR` సినిమాలో అజయ్ దేవగన్ 8 నిమిషాల క్యామియో చేశారు. కేవలం 8 నిమిషాలకు ఆయన రూ.35 కోట్ల పారితోషికం తీసుకున్నారు.
ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా వచ్చిన `ఆర్‌ఆర్‌ఆర్`
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన `RRR` సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. రూ.550 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.
`ఆర్‌ఆర్‌ఆర్` కలెక్షన్లు
`RRR` బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాక్సాఫీస్ వద్ద రూ.1387 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుందని సమాచారం. రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ సీక్వెల్ కథ రెడీ చేస్తున్నట్టు గతంలో తెలిపారు.
అజయ్ దేవగన్ సినిమాల జాబితా
అజయ్ దేవగన్ రాబోయే సినిమాల విషయానికి వస్తే, ఆయన `సన్ ఆఫ్ సర్ధార్ 2`, `దే దే ప్యార్ దే 2`, `దృశ్యం 3`, `శైతాన్ 2` వంటి సినిమాల్లో నటిస్తున్నారు.

