ట్రెండీ వేర్ లో నేహా శెట్టి మెరుపులు.. రాధిక కవ్వించే ఫోజులకు కుర్రాళ్లు చిత్తే..

First Published | Sep 11, 2023, 8:20 PM IST

‘డీజే టిల్లు’ హీరోయిన్ నేహా శెట్టి కిర్రాక్ ఫొటోషూట్లతో నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో మైమరిపిస్తోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

యంగ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty)  బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తోంది. మొదటి నుంచి తెలుగు చిత్రాలతోనే సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కెరీర్ లో జోరు పెంచింది.  
 

‘డీజే టిల్లు’తో మంచి గుర్తింపు దక్కించుకుంది. ‘రాధిక’ పాత్రలో నటించి ఆడియెన్స్ ను మెప్పించింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కానీ, కాస్తా గ్యాప్ ఇచ్చి ఆ క్రేజ్ ను వినియోగించుకోలేకపోయింది. ఇప్పుడు మాత్రం స్పీచ్ మీద ఉంది.


రీసెంట్ గానే ‘ఆర్ ఎక్స్100’ హీరో కార్తీకేయ సరసన ‘బెదురులంక2012’ చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం, విశ్వక్ సేన్ కు జోడీగా ఆయా చిత్రాల్లో నటిస్తోంది. 

ఈ క్రమంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ ను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లపై అందాల వల విసురుతోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. 
 

లేటెస్ట్ ఫొటోస్ లో నేహా కిర్రాక్ లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెండీ వేర్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ఖతర్నాక్ ఫోజులతో కవ్వించింది. మత్తెక్కించే అందాలను ప్రదర్శిస్తూ మతులు చెడగొట్టింది. గుచ్చే చూపులతో ఆకట్టుకుంది.
 

నేహా ఫొటోలను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ లైక్ చేస్తున్నారు. మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక నేహా ప్రస్తుతం ‘రూల్స్ రంజన్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఇలా నెట్టింట దర్శనమిస్తోంది.
 

Latest Videos

click me!