MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Bhairavam Twitter Review: ముగ్గురు హీరోలు కుమ్మేశారు, మంచు మనోజ్ కంబ్యాక్ ఇచ్చినట్లేనా..

Bhairavam Twitter Review: ముగ్గురు హీరోలు కుమ్మేశారు, మంచు మనోజ్ కంబ్యాక్ ఇచ్చినట్లేనా..

మంచు మనోజ్ తో పాటు, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కి కూడా భైరవం చిత్రం విజయం సాధించడం అవసరం. ఇటీవల ఈ ముగ్గురికి సరైన చిత్రాలు లేవు. దీనితో ఈ చిత్రం కోసం ముగ్గురు హీరోలు ప్రాణం పెట్టేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 30 2025, 07:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : X/Vijay Kanakamedala

మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన భైరవం చిత్రం నేడు శుక్రవారం రోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రాధా మోహన్ నిర్మించారు. గత నెలరోజులుగా భైరవం చిత్ర యూనిట్ ఒక రేంజ్ లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ చిత్రానికి బజ్ తీసుకునివచ్చారు. ప్రేక్షకులంతా ఇది మంచు మనోజ్ కి కంబ్యాక్ మూవీ కావాలని కోరుకుంటున్నారు. దాదాపు 9 ఏళ్ళ తర్వాత మంచు మనోజ్ నుంచి వస్తున్న చిత్రం ఇది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image Credit : X/Vijay Kanakamedala

ఈ మూవీలో అదితి శంకర్, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. మంచి అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్ర ప్రీమియర్ షోలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి ప్రేక్షకులు ట్విట్టర్ లో తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. మరి భైరవం చిత్రం ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుందో ఇప్పుడు చూద్దాం. 

Related Articles

Related image1
ముద్దు సీన్ అవసరం, చూస్తే మీకే అర్థం అవుతుంది.. వివాదంపై నటి అభిరామి రియాక్షన్
Related image2
చిరంజీవి నా బిడ్డ లాంటివాడు, అతడితో నాకు పోటీ ఏంటి.. శోభన్ బాబు అలా ఎందుకన్నారో తెలుసా ?
36
Image Credit : X/Vijay Kanakamedala

మంచు మనోజ్ తో పాటు, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కి కూడా భైరవం చిత్రం విజయం సాధించడం అవసరం. ఇటీవల ఈ ముగ్గురికి సరైన చిత్రాలు లేవు. దీనితో ఈ చిత్రం కోసం ముగ్గురు హీరోలు ప్రాణం పెట్టేశారు. ఓపిగ్గా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే..  సినిమా ప్రారంభం అయ్యాక అసలైన కథ మొదలు కావడానికి టైం పడుతుంది. ఫస్టాఫ్ లో అక్కడక్కడా కొన్ని స్పీడ్ బ్రేకర్ లాంటి అనవసర సన్నివేశాలు ఉంటాయి. 

46
Image Credit : X/Vijay Kanakamedala

లవ్ సీన్స్, పాటలు కథ ఫ్లోని అడ్డుకుంటాయి. కానీ ఒకసారి అసలు కథ మొదలయ్యాక ఇంటర్వెల్ బ్లాక్ వరకు అడ్డు ఉండదు. ఎంగేజింగ్ గా అనిపించే సీన్లు పడ్డాయి. డ్రామా, మాస్ యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ముగ్గురు హీరోలు పోటీ పడి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళ ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కొందరు నెటిజన్లు అయితే ఫస్టాఫ్ బావుంది.. అందరూ కుమ్మేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

56
Image Credit : X/Vijay Kanakamedala

కథలో ఒక టెంపుల్ తో కనెక్షన్ ఉంటుంది. దానిని దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. ఇక సెకండ్ హాఫ్ లో కూడా ఆసక్తికర సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. డ్రామాని ఎంగేజింగ్ గా మార్చడంలో దర్శకుడు విజయవంతం అయ్యారు. మనోజ్, బెల్లంకొండ శ్రీను, నారా రోహిత్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆ పాత్రలకు వీళ్ళే కరెక్ట్ అనేలా నటించారు. 

66
Image Credit : X/Vijay Kanakamedala

ఓవరాల్ గా భైరవం చిత్రం ఒకసారి చూడదగ్గ విధంగా ఉందని ప్రేక్షకుల నుంచి రియాక్షన్ వస్తోంది. మంచు మనోజ్ కి సాలిడ్ కంబ్యాక్ అని చెప్పలేం కానీ మంచి చిత్రమే పడింది అని అంటున్నారు. అక్కడక్కడా కథ రొటీన్ గా అనిపించడం, ఫస్టాఫ్ బిగినింగ్ లో స్లోగా ప్రారంభం కావడం లాంటి మైనస్ లు ఉన్నాయి.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
మంచు మనోజ్
సినిమా సమీక్షలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
ముద్దు సీన్ అవసరం, చూస్తే మీకే అర్థం అవుతుంది.. వివాదంపై నటి అభిరామి రియాక్షన్
Recommended image2
చిరంజీవి నా బిడ్డ లాంటివాడు, అతడితో నాకు పోటీ ఏంటి.. శోభన్ బాబు అలా ఎందుకన్నారో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved