భారత క్రికెట్ బోర్డులో మహిళలపై వివక్ష... పురుష క్రికెటర్లను ఒకలా, వుమెన్స్ క్రికెటర్లను మరోలా... సాక్ష్యాలివే

First Published May 18, 2021, 5:10 PM IST

ఎంతగా స్త్రీ సమానత్వం గురించి ఉపన్యాసాలు, ప్రసంగాలు చేసినా... ఇది పురుషాధిక్య సమాజం. భారత క్రికెట్‌లోనూ మహిళా క్రికెట్‌పై, వుమెన్ క్రికెటర్లపై వివక్ష ఉంది. తాజాగా జరుగుతున్న సంఘటనలు మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ, బీసీసీఐ వైఖరిపై తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణమవుతున్నాయి.

ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లే పురుషుల జట్టు కోసం ప్రత్యేకంగా ఛార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన బీసీసీఐ, అదే ఫ్లైట్‌లో మహిళల జట్టును కూడా పంపించనుంది. భారత క్రికెట్ చరిత్రలోనే మహిళా జట్టు, పురుషుల జట్టుతో కలిసి ప్రయాణించడం ఇదే తొలిసారి...
undefined
ఇంగ్లాండ్‌ టూర్‌కి వెళ్లే ముందు ఆటగాళ్లను హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించింది బీసీసీఐ. ఇదే సమయంలో వారితో పాటు వారి కుటుంబసభ్యులు, బంధువులు, పనివాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించనున్నారు.
undefined
పురుషుల క్రికెటర్ల ఇంటికి వెళ్లే, మూడుసార్లు కరోనా టెస్టులు నిర్వహించనుంది బీసీసీఐ. మహిళా క్రికెటర్ల విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు. మహిళా క్రికెటర్లు ఎవరికి వారు వెళ్లి కరోనా టెస్టులు చేయించుకుని, ఆ రిపోర్టులను తీసుకుని రావాల్సిందిగా సూచించింది బీసీసీఐ.
undefined
అలాగే వివిధ ఏరియాల్లో హోమ్ క్వారంటైన్ ఉన్న పురుష క్రికెటర్లను ఛార్టెడ్ ఫ్లైట్ ద్వారా ముంబై విమానాశ్రయానికి చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా క్రికెటర్లు మాత్రం ఎవరికి వారు ముంబై చేరుకోవడానికి సొంత ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది...
undefined
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లోనూ మహిళా క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయం తీవ్రంగా ఉంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఏ+కేటగిరి దక్కించుకున్న పురుష క్రికెటర్లకు యేటా రూ.7 కోట్లు, ఏ కేటగిరి వాళ్లకే ఏటా రూ.5 కోట్లు చెల్లిస్తోంది బోర్డు.
undefined
అదే మహిళా క్రికెటర్ల విషయంలో టాప్ గ్రేడ్ కేటగిరి ప్లేయర్లకు కూడా దక్కేది ఏటా రూ.50 లక్షలే. గ్రేడ్ బీ ప్లేయర్ల ఏటా రూ.30 లక్షలు, గ్రేడ్ సీ ప్లేయర్లకు ఏటా రూ.10 లక్షలు చెల్లిస్తోంది బీసీసీఐ.
undefined
అంటే పురుష క్రికెటర్లకు చెల్లించేదానిలో 10వ వంతు కూడా మహిళా క్రికెటర్లకు చెల్లించడం లేదు. వాస్తవానికి పురుష క్రికెట్‌ ద్వారా వేల కోట్లు ఆర్జిస్తోంది బీసీసీఐ. మెన్స్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చే జనంతో స్టేడియం నిండిపోద్ది, మహిళల మ్యాచ్ చూడడానికి పట్టుమని 100 మంది కూడా రారు.
undefined
అలా చూసుకుంటే మెన్స్ క్రికెట్ ద్వారా వచ్చే ఆదాయాన్నే మహిళల క్రికెట్‌ను మెయింటైన్ చేయడానికి వాడుతోంది బీసీసీఐ. అయితే మిగిలినదేశాల విషయంలోనూ ఇదే పరిస్థితి. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రిటైర్ అయిన మహిళా ప్లేయర్లకు కూడా సకల సౌకర్యాలు కలిగిస్తున్నాయి ఆ దేశ క్రికెట్ బోర్డులు.
undefined
మనదగ్గర ఓ ప్లేయర్‌ కష్టాల్లో ఉన్నా పట్టించుకునేవారు లేరు. భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తల్లి, అక్క కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏంటి? అని కూడా బీసీసీఐ అధికారులు పట్టించుకోవడం లేదని ఆసీస్ మాజీ ప్లేయర్, కామెంటేటర్ లీసా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
undefined
ఇది జరిగిన తర్వాత బీసీసీఐ స్పందించి, వేదా కృష్ణమూర్తి ఫోన్ చేసి ఆమె బాగోగుల గురించి అడిగారట. అంటే మహిళా క్రికెటర్ల పట్ల ఎంత వివక్ష చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని మహిళా క్రికెటర్, వుమన్స్ క్రికెట్ జోన్ ఎడిటర్ అనన్య ఉపేంద్రన్ ఆరోపించారు.
undefined
పురుష క్రికెటర్లను సూపర్ స్టార్లలా చూస్తున్న భారత క్రికెట్ బోర్డు, మహిళా క్రికెటర్లను కనీసం మనుషుల్లా కూడా చూడడం లేదని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది అనన్య... దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి...
undefined
click me!