13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల ముసలోడితో పెళ్లి.. ఎక్కడో తెలుసా? 

By Rajesh Karampoori  |  First Published May 7, 2024, 8:20 PM IST

Child Marriage:  కొంతమంది తల్లిదండ్రులు తమ ఆడ బిడ్డలను భారంగా భావిస్తూ.. పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుందని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే బడికెళ్లి విద్యాబుద్దులు నేర్చుకోవాల్సిన వయస్సులో కాటికి కాలు జాపిన వారికి ఇచ్చి పెళ్లి చేసి..తమ చేతులు దూలుపుకుంటున్నారు. అలాంటి ఘటననే ఒకటి వెలుగులోకి వచ్చింది.


Child Marriage: మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఇద్దరు మనుషులు, రెండు కుటుంబాలు ఏకమయ్యేదే పెళ్లి. ఈ పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇంతటి అమోఘమైన ఘట్టాన్ని ఎవరైనా సంబరాలతో జరుపుకోవాలనుకుని కలలు కంటుంటారు. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూతురికి వివాహం జరిపించి మెట్టినింటికి సాగనంపాలని ఆశతో ఎదురుచూస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులకు తమ కూతురికి మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తారు. \

మరికొంతమంది వరుడు ఎలా ఉన్నా పర్వాలేదు కూతురి వివాహం జరిపించాలనుకుంటారు. హాయిగా చదువుకుంటున్న బాలికలకు పెళ్లి చేసి వారి జీవితాలను చిదిమేస్తున్నారు. అంతే కాదు పెళ్లి వయస్సుకు రాని తమ పిల్లని ముసలివాల్లకి ఇచ్చి వివాహం చేసి వారి గొంతుకొస్తుంటారు. తాజాగా ఇలాంటి ఒక దారుణమైన సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ 70 ఏళ్ల ముసలోడికి 13 ఏళ్ల బాలికను ఇచ్చి పెండ్లి జరిపించాలని చూశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వారందరూ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది, ఆ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.

Latest Videos

undefined

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా  ప్రావిన్స్ సమీపంలోని స్వాత్ లోయలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ 70 ఏళ్ల వృద్ధుడికి 13 ఏళ్ల బాలికను ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి ప్రక్రియ మొదలు పెట్టారు. అంతా ప్రశాంతంగా జరుగుతుందనుకునే లోపే స్థానికులు పెండ్లి పెద్దలకు అదిరి పోయే ట్విస్ట్ ఇచ్చారు.

మైనర్ బాలికకు వివాహం జరిపిస్తున్నారనే సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ వివాహాన్ని ఆపేసి పెళ్లి పెద్దలను, వధువు తండ్రిని, వరుడి అవతారం ఎత్తిన వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మైనర్ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  పాకిస్తాన్ వివాహ చట్టం 1929 ప్రకారం వివాహ వయస్సును మగవారికి 18, ఆడపిల్లలకి 16 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే ఈ సంఘటనలో మైనర్ బాలికకు వివాహం జరిపించినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

click me!