హైపర్ ఆది, రోహిణి, పొట్టి నరేష్ కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్కిట్ చేశారు. ఆ స్కిట్ లో భాగంగా రోహిణి ఈ కామెంట్స్ చేసింది. ఆ స్కిట్ లో బుగ్గలు, ఐస్ క్రీమ్ లో అమ్ముకునే అమ్మాయి పాత్ర చేసింది రోహిణి. హైపర్ ఆది తన పంచెస్ తో రోహిణి వ్యాపారాన్ని దెబ్బ తీస్తాడు. అందుకే రోహిణి ఇలా వాపోతుంది.శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది స్కిట్ ఎప్పటిలానే నవ్వులు పూయించింది. ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. జబర్దస్త్ కొంచెం డౌన్ కాగా... శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి టీఆర్పీ రాబడుతుంది. ఇంద్రజ, రష్మీ గౌతమ్, హైపర్ ఆది షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.