సూపర్ సెంచరీతో ఐపీఎల్ చ‌రిత్ర‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డు..

By Mahesh Rajamoni  |  First Published May 7, 2024, 12:28 AM IST

Suryakumar Yadav : వాంఖడే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ సూప‌ర్ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో ముంబై ఇండియన్స్ కు విక్ట‌రీ అందించాడు. రెండో ఐపీఎల్ సెంచరీని సాధించాడు.
 


MI vs SRH - IPL 2024: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ 55వ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్-ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ముంబై జట్టు కేవలం 31 పరుగుల స్కోరు వద్ద ముగ్గురు ముఖ్యమైన బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. 51 బంతుల్లో సెంచ‌రీ (102 పరుగుల‌) ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో తిలక్ వర్మ 37 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి  సూప‌ర్ బ్యాటింగ్ తో ముంబై  చేతితో హైద‌రాబాద్ చిత్తుగా ఓడింది.

ఈ మ్యాచ్ లో సెంచ‌రీ సాధించిన సూర్య‌కుమార్ యాద‌వ్ మ‌రో రికార్డును న‌మోదుచేశాడు. టోర్నీ చరిత్రలో ఐపీఎల్‌లో విజయవంతమైన పరుగులో సెంచరీ కొట్టిన నాలుగో ఎంఐ ప్లేయర్‌గా సూర్యకుమార్ నిలిచాడు. సనత్ జయసూర్య, లెండిల్ సిమన్స్, కామెరాన్ గ్రీన్ వంటి ఎలైట్ లిస్ట్‌లో చేరడంతో పాటు ముంబై విజ‌య‌వంత‌మైన‌ రన్-ఛేజింగ్‌లలో సెంచ‌రీ కొట్టాడు.

Latest Videos

undefined

ఐపీఎల్ రన్-ఛేజింగ్‌లలో సెంచ‌రీ కొట్టిన ముంబై ఆట‌గాళ్లు.. 

1 - సనత్ జయసూర్య: ఐపీఎల్ 2008లో 114* vs చెన్నై

2 - సూర్యకుమార్ యాదవ్: ఐపీఎల్ 2024లో 102* vs హైద‌రాబాద్ 

3 - లెండిల్ సిమన్స్: ఐపీఎల్ 2014లో 100* vs పంజాబ్

4 - కామెరాన్ గ్రీన్: ఐపీఎల్ 2023లో 100* vs హైద‌రాబాద్ 

5 - కోరీ ఆండర్సన్: ఐపీఎల్ 2014లో 95* vs రాజస్థాన్

తన ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించిన సూర్యకుమార్ నాక్ లో 12 ఫోర్లు, 6 సిక్స‌ర్లు ఉన్నాయి. తిలక్ వర్మతో క‌లిసి 4వ వికెట్‌కు 143 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్ర‌మంలోనే డ్వేన్ స్మిత్, స‌చిన్ టెండూల్కర్ 163*తో అజేయంగా నిలిచిన భాగ‌స్వామ్యం త‌ర్వాత స్థానంలో రెండో అత్య‌ధిక ముంబై భాగ‌స్వామ్యంగా నిలిచింది. అలాగే, ముంబై ఇండియ‌న్స్ కోసం సూర్య‌కుమార్ యాద‌వ్ సాధించిన రెండో సెంచ‌రీ ఇది. దీంతో రోహిత్ శ‌ర్మ స‌ర‌స‌న నిలిచాడు. ఇదిలావుండ‌గా, హైద‌రాబాద్ పై గెలుపుతో ఐపీఎల్ 2024 పాయింట్ల ప‌ట్టిక‌లో ముంబై ఇండియ‌న్స్ 9వ స్థానంలోకి చేరుకుంది.

 

No stress, thanks to an all-round, heated outing with 3X Protection by our boys in blue-and-gold tonight 🤩

Pick your Performance of the Day in 👉 https://t.co/q2esSVBFVu | pic.twitter.com/CXBRO1xPMV

— Mumbai Indians (@mipaltan)
click me!