Team India Jersey : టీ20 ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టు కొత్త జెర్సీని హెలికాప్టర్ ద్వారా ఆవిష్కరించారు. నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన త్రివర్ణాన్ని కలిగి ఉండేలా రూపొందించారు.
T20 World Cup India Jersey : జూన్ 1 నుంచి జూన్ 29 వరకు అమెరికా, వెస్టిండీస్ మధ్య టీ20 ప్రపంచకప్ సిరీస్ జరగనుంది. ఇప్పటికే అన్ని దేశాల టీమ్ లు తమ జట్లను ప్రకటించాయి. ఈ మెగా టోర్నమెంట్ లో మొత్తం 20 జట్లు పాలుపంచుకుంటున్నాయి. ఈ 9వ టీ20 వరల్డ్‌లో భారత్, ఇంగ్లండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, న్యూజిలాండ్, ఐర్లాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అమెరికా, వెస్టిండీస్, ఒమన్, కెనడా, ఉగాండా, పపువా న్యూ గినియా, దక్షిణాఫ్రికా, నమీబియా జట్లు పాల్గొంటున్నాయి.
20 జట్లు 4 గ్రూపులుగా..
ఈ 20 జట్లను 4 గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ఏప్రిల్ 30న ప్రకటించారు. రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కెప్టెన్), సంజు శాంసన్ (కెప్టెన్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా లు టీమ్ లో ఉన్నారు. అలాగే, అలాగే రింగు సింగ్, శుభ్ మన్ గిల్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా చేర్చారు. టీమ్‌లో ఏవైనా మార్పులు చేయడానికి మే 25 వరకు గడువు ఇచ్చారు. ఈ సిరీస్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. జూన్ 5న న్యూయార్క్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
భారత జట్టుకోసం కొత్త జెర్సీ..
వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరిగే టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించగా, తాజాగా కొత్త జెర్సీని కూడా ఆవిష్కరించింది బీసీసీఐ. కొత్త జెర్సీని హెలికాప్టర్ ద్వారా విడుదల చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొత్త జెర్సీలో కాలర్‌పై నారింజ, తెలుపు, ఆకుపచ్చ మూడు రంగులు ఉండేలా డిజైన్ చేశారు. అలాగే రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు ఈ వీడియోలో కనిపించారు. అధికారిక కిట్ స్పాన్సర్ అయిన అదిదాస్ ధర్మశాల స్టేడియం బ్యాక్‌డ్రాప్‌తో వన్ జెర్సీ వన్ నేషన్ స్లోగన్‌తో ఆవిష్కరించింది.
క్రికెట్ లవర్స్ కోసం కొత్త జెర్సీ అమ్మకాలు..
2007 టీ20 ప్రపంచకప్ భారత జెర్సీలో నీలం రంగు ప్రధానమైనదిగా ఉంది. నారింజ, ఆకుపచ్చ రంగు చాలా తక్కువ. కానీ ఇప్పుడు 2024 కోసం కొత్తగా రూపొందించిన టీ20 జెర్సీ మరింత ఎక్కువగా నారింజ రంగును కలిగి ఉండేలా రూపొందించబడింది. భారత జట్టు కొత్త జెర్సీ ఆన్‌లైన్‌లో, ఆఫ్ లైన్ స్టోర్‌లలో మంగళవారం నుంచి (మే 7 ) నుంచి ఉదయం 10 గంటలకు అమ్మకానికి రానుంది. ప్రముఖ ఆన్ లైన్ స్టోర్లు, ఆఫ్ లైన్ స్టోర్లలో లభించనుంది.