అత‌ను మా జ‌ట్టులో ఉండ‌టం అదృష్టం.. హార్దిక్ పాండ్యా కామెంట్స్ వైర‌ల్

By Mahesh Rajamoni  |  First Published May 7, 2024, 12:50 AM IST

Hardik Pandya : ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ సూప‌ర్ సెంచ‌రీ, తిల‌క్ వ‌ర్మ మంచి ఇన్నింగ్స్ తో ముంబై ఇండియన్స్ ఘన  విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలోనే హార్దిక్ పాండ్యా చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. 
 


MI vs SRH - IPL 2024: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024 ) 55వ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జ‌ట్టు పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ను ఓడించింది. దీంతో ఐపీఎల్ 2024లో తమ 4వ విజయాన్ని నమోదు చేసిన ముంబై.. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది.

టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా మొదట బౌలింగ్ ఎంచుకోవ‌డంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన హైద‌రాబాద్ టీమ్ 20 ఓవ‌ర్ల‌లో 173/8 ప‌రుగులు చేసింది. హార్దిక్ పాండ్యా, పియూష్ చావ్లాలు అద్భుత‌మైన బౌలింగ్ తో తలో 3 వికెట్లు తీసుకున్నారు. 174 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ముంబై ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన సూర్య‌కుమార్ యాద‌వ్, తిల‌క్ వ‌ర్మ‌లు ముంబైకి విజ‌యాన్ని అందించారు. 51 బంతుల్లో 102 పరుగులు సూప‌ర్ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో 17.2 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించాడు సూర్య‌కుమార్ యాద‌వ్.

Latest Videos

undefined

మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ కార్య‌క్ర‌మంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన బ్యాటర్లపై ప్ర‌శంస‌లు కురిపించాడు. "మేము మంచి క్రికెట్ ఆడటంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాము, మేము ఇంకా 10-15 పరుగులు అదనంగా ఇచ్చామని అనుకుంటున్నాము. మా బ్యాటర్లు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతమైనది" అని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ గురించి మరింత మాట్లాడుతూ.. సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేయడానికి ఇష్టపడతాననీ, అది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ పై పనిచేసిందని చెప్పాడు. ముడు వికెట్ల‌తో మెరిసిన వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా పై కూడా ప్ర‌శంస‌లు కురిపించాడు.

సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనకు హార్దిక్ పాండ్యా ఫిదా అయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించడంలో ముంబై హీరోగా నిలిచాడని సూర్య‌పై హార్దిక్ పాండ్యా ప్ర‌శంస‌లు కురిపించాడు. "ఇది నమ్మశక్యం కాదు, సూర్య అత్యుత్తమ గతం ఏమిటంటే అతను బౌలర్లను ఒత్తిడికి గురిచేయడం. ఇది పూర్తి ఆత్మవిశ్వాసం, అతని ఆట మారింది, అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకడు. అతను గేమ్‌ను వేరే విధంగా మార్చగలడు, అతనిని మా జ‌ట్టులో క‌లిగి ఉండ‌టం మా అదృష్టం" అని అన్నారు.

click me!