మాథ్యూ హేడెన్ వచ్చి బూతులు తిట్టడం మొదలెడతాడేమో అనుకున్నా... ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

First Published Apr 13, 2023, 4:52 PM IST

2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న అతి కొద్ది మంది ప్లేయర్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. 14 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ, 4 సార్లు టైటిల్ అందించాడు. ఐపీఎల్ 2008 ఆరంగ్రేట సీజన్‌ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్ ధోనీయే...

(PTI PhotoR Senthil Kumar)(PTI04_12_2023_000216B)

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీకి 200వ మ్యాచ్. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ, 2023 సీజన్ తర్వాత ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటాడని జోరుగా ప్రచారం జరుగుతోంది...

‘2008లో ఐపీఎల్ ఆరంభమైనప్పుడు ఇది ఎలా సాధ్యం? వేర్వేరు దేశాల ప్లేయర్లను ఎలా ఆడిస్తారో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉండేది. ఐపీఎల్ పూర్తిగా ఓ కొత్త వాతావరణాన్ని సృష్టించింది. విదేశీ ప్లేయర్లలో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం వంటివి మొదటిసారి ఐపీఎల్‌లోనే మొదలైంది...

Latest Videos


ఫారిన్ ప్లేయర్లు ఎలా ఉంటారు? ఎలా మాట్లాడతారో తెలీదు. మాథ్యూ హేడెన్ గురించి చెప్పాలంటే, అతనికి నాకు మధ్య చాలా సార్లు గొడవ అయ్యింది. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచులు జరిగేటప్పుడు మాథ్యూ హేడెన్ బూతులు తిడుతూ సెడ్జింగ్ చేయడం చాలా సార్లు చూశాను. కొన్ని సార్లు నాక్కూడా అనుభవం అయ్యింది..

అతను, నేను ఒకే టీమ్‌. పంజాబ్ కింగ్స్‌తో మొదటి మ్యాచ్‌కి ముందు స్ట్రాటెజీ గురించి మాట్లాడేందుకు టీమ్ మీటింగ్ పెట్టాం. మాథ్యూ హేడెన్‌ని అంతర్జాతీయ క్రికెట్‌లో చూసేవాడిని. అతను రాగానే వచ్చి బూతులు తిడతాడేమో, కోపంగా అరుస్తాడేమోనని కంగారు పడ్డాను కూడా...

అయితే ఆ మీటింగ్‌లో హేడెన్, తాను బ్రెట్‌ లీతో మాట్లాడతానని చెప్పాను. నాకు చాలాసేపటి వరకూ అతను ఏం చెప్పాడో అర్థం కాలేదు.. నేను మ్యాచ్ సమయంలో వెళ్లి బ్రెట్‌ లీతో మాట్లాడతా అని చెప్పాడని తర్వాత అర్థమైంది..  

మ్యాచ్ రోజు అతను చెప్పినట్టుగానే మ్యాచ్ ప్రారంభం కాగానే రెండో బంతికి అతను వెళ్లి బ్రెట్ లీతో మాట్లాడాడు. అతను ఏం మాట్లాడాడో తెలీదు కానీ తన టీమ్‌ మేట్‌ని పలకరించడానికి పర్మిషన్ అడిగాడని మాత్రం అర్థమైంది. మాథ్యూ హేడెన్ పైకి కనిపించేలా కఠిన మనస్థత్వం ఉన్నవాడు కాదని తర్వాత అర్థమైంది. మేం మంచి స్నేహితులుగా మారాం..

2008 వేలానికి ముందు నన్ను కూడా డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు సంప్రదించాయి.. అయితే నేను వేలానికే వెళ్లాలని అనుకున్నాం. నాకు ఎంత విలువ వస్తుందో తెలుసుకుందామనుకున్నా. వేలం ముగిసింది. నాకు భారీ ప్రైజ్ దక్కింది. అక్కడి దాకానే ఆలోచించా...’ అంటూ చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ..

click me!