ఇలా చేస్తే.. మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు

First Published | Oct 9, 2024, 11:33 AM IST

దసరా, దీపావళి ఇలా పండుగలు ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి. పండుగకు అందంగా కనిపించాలంటే మేకప్ ను వేసుకోవాల్సిందే. కానీ మీరు మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపించే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

ప్రతి ఒక్కరికీ పండుగ సీజన్ అంటే ప్రత్యేకమే. ఈ సమయంలో అందరిలో అందంగా కనిపించాలని ప్రతి ఒక్క మహిళా కోరుకుంటుంది. ఇందుకోసం మార్కెట్ లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఉంటాయి.

ఇవి మిమ్మల్ని అందంగా కనిపించేలా చేసినా.. మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. అందే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఆధారపడకుండా నేచురల్ గా మీ ముఖాన్ని అందంగా, మెరిసేలా చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. 

నిజానికి మేకప్ మీ ముఖంపై మచ్చలను, డల్ నెస్ ను దాచిపెడుతుంది. కానీ కొద్దిసేపటి వరకు మాత్రమే. ఎందుకంటే మేకప్ ఎక్కువసేపు ఉండదు. అలాగే మేకప్ ను ఎక్కువగా ఉపయోగిస్తే ముఖంపై మొటిమలు, దద్దుర్లు, చర్మపు చికాకు వంటి ఎన్నో చర్మ సమస్యలు వస్తాయి. 

కానీ మీరు మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు. నిపుణుల ప్రకారం.. మేకప్ వేసుకోకుండా అందంగా కనిపించాలంటే ఆరోగ్యకరమైన, సరైన చర్మ సంరక్షణ దినచర్యను అనుసరించడం చాలా ముఖ్యం.

అయితే మీరు కొన్ని సింపుల్ టిప్స్ ను ఫాలో అయితే మేకప్ అవసరం లేకుండా మీరు అందంగా కనిపిస్తారు. మీ స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

Latest Videos


Image: Getty Images

క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి

మీ చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే మీరు క్రమం తప్పకుండా ముఖాన్ని శుభ్రపరచాలి. ఎందుకంటే కాలుష్యం, దుమ్ము, దూళి, అదనపు నూనెల చర్మ రంధ్రాలు మూసుకుపోయి చర్మం నీరసంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకే ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేల కనీసం రెండు సార్లైనా ముఖాన్ని క్లీన్ చేయాలి. 

ఫేస్ వాష్ 

ఆయిలీ స్కిన్ ఉన్నవారు జెల్ ఆధారిత క్లెన్సర్ ను యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది ముఖంపై ఉన్న అదనపు నూనెను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. ఇకపోతే సున్నితమైన చర్మం ఉన్నవారు సల్ఫేట్ రహిత క్లెన్సర్ ను ఉపయోగించాలి. ఇది మీ స్కిన్ కు ఎలాంటి హాని చేయకుండా.. క్లీన్ చేస్తుంది. ఇకపోతే డ్రై స్కిన్ ఉన్నవారు చర్మాన్ని హైడ్రేట్ గా, తేమగా ఉంచే క్రీమీ క్లెన్సర్ ను ఉపయోగించాలి. 
 

హైడ్రేషన్

చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండాలంటే హైడ్రేట్ గా ఉండటం చాలా అవసరం. చర్మం సరిపడా తేమను పొందకపోతే స్కిన్ డ్రైగా, నిర్జీవంగా, పొలుసుగా కనిపిస్తుంది. హైడ్రేషన్ చర్మాన్ని గ్లో గా చేయడమే కాకుండా.. చర్మం స్థితిస్థాపకతను కూడా నిర్వహిస్తుంది. ఇది ముఖంపై ఉన్న ముడతలను, సన్నని గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. 

మాయిశ్చరైజర్ 

చర్మం హెల్తీగా ఉంటేనే.. మీరు అందంగా కనిపిస్తారు. ఇందుకోసం మాయిశ్చరైజర్ చాలా అవసరం. ఇందుకోసం హైలురోనిక్ ఆమ్లం ఉన్న మాయిశ్చరైజర్లను ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీ చర్మంలో నీటిని నిలుపుకోవడానికి, ఎక్కువసేపు హైడ్రేట్ గా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.
 

skin care

లోపలి నుంచి హైడ్రేషన్

చర్మం ఆరోగ్యంగా ఉండటానికి అవుట్ డోర్ హైడ్రేషన్ మాత్రమే సరిపోదు. చర్మానికి లోపలి నుంచి తేమగా ఉంచడం కూడా అవసరమే. ఇందుకోసం మీరు నీళ్లను పుష్కలంగా తాగాలి. మీరు రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగితే మీ చర్మం హెల్తీగా ఉంటుంది. 

సన్స్క్రీన్ 

సూర్యుని హానికరమైన యువీ కిరణాల వల్ల చర్మం చాలా దెబ్బతింటుంది. ఇది మీ చర్మం పిగ్మెంటేషన్ ను పెంచుతుంది. అలాగే ముఖంపై ముడతలు, మచ్చలు అయ్యేలా చేస్తుంది. అందుకే సీజన్ తో సంబంధం లేకుండా సన్స్క్రీన్ ను వాడండి. 

click me!