ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటే మీకు 18 ఏళ్లు నిండి ఉండాలి. సాలరీ వచ్చేసి నెలకు రూ.35 వేల వరకు ఇస్తారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలనుకుంటే అక్టోబర్ 21 లోపు మీరు దరఖాస్తు చేయాలి. అక్టోబర్ 02 నుంచే ఆన్ లైన్ లో అప్లికేషన్స్ ప్రాసెస్ ప్రారంభమైంది. www.nabard.org. వెబ్ సైట్ లోకి వెళ్లి ఆఫీస్ అటెండెంట్ అప్లికేషన్ ఓపెన్ చేసి మీ వివరాలు పూర్తి చేసి సెండ్ చేస్తే సరిపోతుంది. ఆన్ లైన్ ఎక్జామ్ నవంబర్ 21-2024లో ఉంటుంది.
ఆన్ లైన్ లోనే టెస్ట్ పెట్టడం ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఇందులో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీలపై మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫెసియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులు తెలుగు భాషపై పరీక్ష రాయాల్సి ఉంటుంది. మీ ఇందులో నాబార్డ్ ఎస్టిమేషన్స్ ను మీరు రీచ్ చేయగలిగితే తర్వాత ఇంటర్వూ నిర్వహిస్తారు. అందులో కూడా నాబార్డ్ నిబంధనలకు అనుగుణంగా మీరు పర్ఫామ్ చేయగలిగితే మీకు ఆఫీస్ అటెండెంట్ జాబ్ వచ్చినట్టే.