ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ కొంప ముంచింది ఇదే - ఈ సారి ఎవ‌రిని జ‌ట్టుతో ఉంచుకుంటుంది?

By Mahesh RajamoniFirst Published Oct 3, 2024, 4:39 PM IST
Highlights

IPL 2025 - RCB : ఐపీఎల్ చరిత్రలో సరైన ఆటగాళ్లను ఎంపిక చేయ‌డంలో విఫ‌ల‌మైంద‌నే చెడ్డ పేరును తెచ్చుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రాబోయే ఐపీఎల్ 2025 మెగా వేలంలో సరైన ఆటగాళ్లను ఎంచుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న. ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ జ‌ట్టు ఏం వ్యూహాలు చేస్తోంది. జ‌ట్టులో ఎవ‌రిని ఉంచుకోనుంది? 
 

IPL 2025 - RCB : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) పేరు విన‌గానే జ‌ట్టులో ఉంటే స్టార్ ప్లేయ‌ర్లు గుర్తు వ‌స్తారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఈ టీమ్ లోనే భార‌త స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీతో పాటు చాలా మంది లెజెండ్ ప్లేయ‌ర్లు ఆర్సీబీ త‌ర‌ఫున ఆడారు. దుమ్మురేపే ఇన్నింగ్స్ ల‌తో స‌రికొత్త రికార్డులు సృష్టించారు. కానీ, ఐపీఎల్ క్రికెట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ ట్రోఫీని గెలవలేక‌పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీనికి ప్ర‌ధాన కార‌ణాలు గ‌మ‌నిస్తే జ‌ట్టు ఎప్పుడూ కూడా బ్యాట్స్ మెన్, బౌల‌ర్లు, ఆల్ రౌండ‌ర్ల‌తో స‌మ‌తూకంగా లేక‌పోవ‌డ‌మే.

స్టార్ బ్యాట‌ర్లు ఉన్నా బౌలింగ్ విభాగం ఎప్పుడూ ఆర్సీబీని దెబ్బ‌కొడుతూనే ఉంది. అలాగే, కీల‌క స‌మ‌యంలోనూ బ్యాట‌ర్లు రాణించ‌ని ప‌రిస్థితుల‌ను చాలా సార్లు చూసింది. మ‌రి  గత ఐపీఎల్ వేలంలో చేసిన తప్పుల నుండి ఈ సారైనా పాఠాలు నేర్చుకుంటుందా అనేది క్రికెట్ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న పెద్ద ప్ర‌శ్న‌. ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభం నుంచి గ‌మ‌నిస్తే ప్లేయ‌ర్ల‌ను ఎంపిక చేయ‌డంలో.. జ‌ట్టును అన్ని విభాగాల్లో స‌మంగా ఉంచ‌డంలో ఎప్పుడూ విఫ‌ల‌మ‌వుతూనే ఉంది. మ‌రి ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ ప్లానేంటి? గ‌తంలో ప్లేయ‌ర్ల ఎంపిక విష‌యంలో చేసిన త‌ప్పులేంటి? ఎక్కువ‌గా ఏ ఆట‌గాళ్ల‌తో ఆర్సీబీ న‌ష్ట‌పోయింది? అనే వివ‌రాలు గ‌మ‌నిస్తే..

Latest Videos

 

ఒక్క‌సారి కూడా ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని ఎందుకు గెలుచుకోలేక‌పోయింది? 

 

ఇప్పటి వరకు 17 ఐపీఎల్ సీజన్లు జ‌రిగాయి. అయితే, ఒక్కసారి కూడా విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ ట్రోఫీని గెలవ‌లేక‌పోయింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం వారి పేలవమైన జట్టు ఎంపిక విష‌యం ముందుంటుంది. ఒక్క‌రు ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌పై ఆధార‌ప‌డ‌కుండా టీమ్ ను అన్ని విభాగాల్లో స‌మంగా ఉంచితేనే విజ‌య‌వంతంగా ముందుకు సాగుతుంది. కానీ, ప్ర‌తిసారి ఆర్సీబీ చేసే పెద్ద త‌ప్పు జ‌ట్టును అన్ని విభాగాల‌పై ఫోక‌స్ చేయ‌క‌పోవ‌డ‌మే. ఎక్కువ‌గా బ్యాటింగ్ విభాగంపై దృష్టి పెట్టి బౌలింగ్, ఫీల్డింగ్ విష‌యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌డం ఆర్సీబీని దెబ్బ‌కొట్టింది. 

ఇక ఆట‌గాళ్ల ఎంపిక విష‌యంలో కూడా చాలా త‌ప్పిదాలు చేసింది. ఒక్క‌రు ఇద్ద‌రు ప్లేయ‌ర్ల కోసం ప‌ర్సులోని మ‌నీని చాలా ఖ‌ర్చు చేసిన సంద‌ర్బాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక ప్లేయ‌ర్లను ముంబై ఇండియన్స్ నుండి 17.50 కోట్ల రూపాయలకు ట్రేడ్ ద్వారా కొనుగోలు చేసింది. అయితే, చాలా పెద్ద త‌ప్పిద‌మ‌ని టోర్నీ మొద‌లైన త‌ర్వాత ఆర్సీబీకి తెలిసింది. ఎందుకంటే ఈ ట్రేడింగ్ తో మినీ వేలానికి ముందే ఆర్‌సీబీ పర్స్‌లో పెద్దగా డబ్బులు మిగలలేదు. ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో కామెరాన్ గ్రీన్ 13 మ్యాచ్‌ల్లో మొత్తం 255 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 46 పరుగులు. అలాగే 13 మ్యాచుల్లో 35.1 ఓవర్లు బౌలింగ్ చేసి 303 పరుగులు ఇచ్చి, 10 వికెట్లు పడగొట్టాడు. 


ఐపీఎల్ లో ఆర్సీబీ కొంప ముంచిన ఆట‌గాళ్ల వేలం ఏమిటి? 

 

 

చెతేశ్వర్ పుజారా:

టెస్టు క్రికెట్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన ప్లేయ‌ర్  చెతేశ్వర్ పుజారా. పుజారా టీ20, వన్డే మ్యాచ్‌లకు సరైన బ్యాట్స్‌మెన్ కాదన్న విషయం తెలిసిందే. అయితే 2011లో రూ.3.22 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆర్సీబీ తరఫున ఆడిన 3 ఏళ్లలో పుజారా మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 143 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.

అల్జారీ జోసెఫ్:

అల్జారీ జోసెఫ్ మంచి ఫాస్ట్ బౌలర్ అయినప్పటికీ వేలంలో అతనికి రూ.11.5 కోట్లు కాస్త ఎక్కువే. 2023 వేలంలో ద‌క్కించుకుంది ఆర్సీబీ. అల్జారీ జోసెఫ్ కేవలం 3 మ్యాచ్‌లు ఆడి 115 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. 

కైల్ జేమిసన్:

ఆర్సీబీకి మరో బ్యాడ్ ఆప్షన్ కైల్ జేమీసన్. ఆర్సీబీ 2021లో జేమీసన్‌ను రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ జేమీసన్ పేలవమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. అత‌ను ఆడిన 9 మ్యాచ్‌లలో 9 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అలాగే, 65 పరుగులు మాత్ర‌మే చేశాడు. న్యూజిలాండ్ జట్టుకు ఫాస్ట్ బౌలర్‌గా నిలిచిన కైల్ జేమిసన్ కు ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టులో నిలకడగా చోటు దక్కలేదు.

 

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ రిటెన్షన్ ప్లేయర్లు ఎవరు? 

 

విరాట్ కోహ్లీ – రూ.15 కోట్లు

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ప్రతి జట్టు 6 మంది ఆటగాళ్లను ఉంచుకోవడానికి అవ‌కాశ‌ముంది. దాని ప్రకారం రూ.15 కోట్లకు విరాట్ కోహ్లీని ఆర్సీబీ జట్టులో ఉంచుకోవ‌డం ప‌క్కా. 2024 ఐపీఎల్ టోర్నమెంట్‌లో విరాట్ కోహ్లీ 15 మ్యాచ్‌ల్లో 5 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ సహా మొత్తం 741 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 113* పరుగులు ఉన్నాయి. అలాగే, ఐపీఎల్ ప్రారంభం నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీ జ‌ట్టుకు ఆడుతున్నాడు. ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లీ అనేలా మారాయి ప‌రిస్థితులు కాబట్టి బెంగ‌ళూరు టీమ్ కోహ్లీ ఆడిన‌న్ని రోజులు జ‌ట్టుతోనే ఉంచుకుంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. 

 

మహ్మద్ సిరాజ్ – రూ.7 కోట్లు

ఆర్‌సీబీ తరఫున ఆడుతున్న మహ్మద్ సిరాజ్ గత ఐపీఎల్ టోర్నీలో 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ త‌మ‌తో అంటిపెట్టుకునే ప్లేయ‌ర్ల‌లో సిరాజ్ కూడా ఉంటాడు. ఆర్సీబీ జట్టు మహ్మద్ సిరాజ్‌ను రూ.7 కోట్లకు ఉంచుకోవాలని భావిస్తోంది. 

యశ్ దయాల్:

మహ్మద్ సిరాజ్‌తో పోలిస్తే యశ్ దయాల్ 14 మ్యాచ్‌ల్లో 459 పరుగులు ఇచ్చాడు. అయితే 15 వికెట్లు తీశాడు. గత ఐపీఎల్ వేలంలో యశ్ దయాల్ ను రూ.5 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అదే మొత్తంతో యశ్ దయాల్‌ను ఆర్‌సీబీ జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. 

రజత్ పాటిదార్:

రూ.50 లక్షలతో ఆర్సీబీ జట్టులో చోటు దక్కించుకున్న రజత్ పాటిదార్ ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో ఆడిన 15 మ్యాచ్‌ల్లో 5 అర్ధసెంచరీలతో సహా 395 పరుగులు చేశాడు. అత‌ని అత్య‌ధిక స్కోరు 55 పరుగులు.  అందుకే రాబోయే ఐపీఎల్ కు పాటిదార్ ను కూడా ఆర్సీబీ త‌మ‌తోనే ఉంచుకోవాల‌ని చూస్తోంది. అయితే, అత‌నికి ఇప్పుడు ఆర్సీబీ కనీసం రూ.4 కోట్లు చెల్లించే అవకాశం ఉంది.
 

click me!