Sarfaraz Khan : 65 ఏళ్లలో తొలిసారి.. ఈ రికార్డును సచిన్, గవాస్కర్, రోహిత్ లు కూడా సాధించ‌లేక‌పోయారు

By Mahesh RajamoniFirst Published Oct 2, 2024, 11:56 PM IST
Highlights

Mumbai batter Sarfaraz Khan double-century : ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాలో అరంగేట్రం చేశాడు. సూప‌ర్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్ట‌డంతో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ జ‌ట్టులో కూడా చోటుద‌క్కించుకున్నాడు. కానీ, ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుద‌క్క‌లేదు. అయితే, ఇప్పుడు ఇరానీ క‌ప్ లో డబుల్ సెంచ‌రీతో సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడాడు.
 

Mumbai batter Sarfaraz Khan double-century : త‌న‌ అరంగేట్రం సిరీస్ లోనే బ్రిటీష్  గుండెల్లో భయం పుట్టించిన సర్ఫరాజ్.. సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. ఇప్పుడు ఇరానీ కప్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో స‌రికొత్త‌ రికార్డు సృష్టించాడు. దిగ్గ‌జ ప్లేయ‌ర్లు సాధించ‌లేని  ఘ‌త‌న సాధించాడు. ఇరానీ కప్‌లో సచిన్ టెండూల్క‌ర్, సునీల్ గవాస్కర్, రోహిత్ శ‌ర్మ వంటి లెజెండ‌రీ ప్లేయ‌ర్లు సైతం  సాధించ‌లేని రికార్డును సర్ఫరాజ్ ఖాన్ నెలకొల్పాడు.

 

ఇరానీ కప్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచ‌రీ

Latest Videos

 

ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ 2024 ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాపై డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీ ఛాంపియన్‌ అయిన రెస్ట్ ఆఫ్ ఇండియా - ముంబై మధ్య జరిగిన ప్రతిష్టాత్మక ఫైనల్‌లో 2వ రోజు సర్ఫరాజ్ ఈ ఘనతను సాధించాడు. ముఖ్యంగా ఇరానీ కప్ చరిత్రలో ముంబై తరఫున డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా సర్ఫరాజ్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో  రెస్ట్ ఆఫ్ ఇండియా ముందుగా ఫీల్డింగ్‌ని ఎంచుకుంది. ఓపెన‌ర్లు రాణించ‌క‌పోవ‌డంతో సర్ఫరాజ్ రహానేతో క‌లిసి ఇన్నింగ్స్ ను కొన‌సాగించాడు. రహానే తన డిఫెన్సివ్ విధానాన్ని కొనసాగించగా, మరో ఎండ్ నుంచి సర్ఫరాజ్ ఎదురుదాడికి దిగాడు. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఈ క్ర‌మంలోనే త‌న 15వ ఫస్ట్-క్లాస్ సెంచ‌రీ పూర్తి చేశాడు.

 

253 బంతుల్లో సర్ఫరాజ్‌ ఖాన్ డబుల్ సెంచరీ

 

 

సర్ఫరాజ్‌కి ఆ త‌ర్వాత‌ తనుష్ కోటియన్ మద్దతు లభించింది. వీరిద్దరు ముంబై స్కోరును 280/6 నుంచి 460 దాటించారు. సర్ఫరాజ్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో చివరి సెషన్‌లో తన డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. స‌ర్ఫ‌రాజ్ 253 బంతుల్లో త‌న డ‌బుల్ సెంచ‌రీని సాధించాడు. దీంతో ఇరానీ కప్ చరిత్రలో ముంబై తరఫున డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాటర్‌గా సర్ఫరాజ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్‌కు గతంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 1972లో ఆర్‌డి పార్కర్ చేసిన 195 ప‌రుగుల రికార్డును స‌ర్ఫ‌రాజ్ ఖాన్ బ్రేక్ చేశాడు. ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీతో ఓవరాల్‌గా 11వ బ్యాటర్‌గా సర్ఫరాజ్ నిలిచాడు. 2023లో చివరిసారిగా యశస్వి జైస్వాల్ ఈ ఘనత సాధించారు.


 

🚨 69.6 AVERAGE IN FIRST CLASS CRICKET FOR SARFARAZ KHAN 🚨

- The Madness, Sarfu...!!!!! pic.twitter.com/OXtRyRHJ14

— Johns. (@CricCrazyJohns)

 

ముంబయి తరఫున 65 ఏళ్ల చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 

 

ఇరానీ కప్‌లో అజింక్యా రహానే కెప్టెన్సీలో ఉన్న జట్టులో సర్ఫరాజ్ ఖాన్ ముంబయి తరఫున 65 ఏళ్ల చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు ముంబైకి ఆడినా ఈ ఘనత సాధించలేకపోయారు. రోజు ఆట ముగిసే వరకు సర్ఫరాజ్ 221 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 25 ఫోర్లు, 4 సిక్సర్లు కూడా కొట్టాడు. 

1972లో 194* పరుగులు చేసిన రామ్‌నాథ్ పార్కర్ రికార్డును సర్ఫరాజ్ ఖాన్ బ్రేక్ చేశాడు. అలాగే, 2010లో 191 పరుగులు చేసిన కెప్టెన్ అజింక్యా రహానేను కూడా అధిగ‌మించాడు.  అయితే, ఆ సమయంలో ముంబై జట్టు రెస్ట్ ఆఫ్ ఇండియా చేతిలో ఓడిపోయింది. ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ చేసిన 11వ బ్యాట్స్‌మెన్‌గా సర్ఫరాజ్ ఘ‌న‌త సాధించాడు. ఇరానీ కప్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు వసీం జాఫర్ (286) పేరిట ఉంది.

 

 

స‌ర్ఫ‌రాజ్ ఖాన్ తో కేఎల్ రాహుల్ స్థానానికి ప్రమాదం?

 

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ భార‌త జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా ఉన్నాడు. కానీ, ప్లేయింగ్ ఎలెవన్‌లో అతని స్థానంలో కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. సర్ఫరాజ్ రెండు టెస్టుల్లోనూ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ద‌క్కించుకోలేదు. అయితే, ఇరానీ కప్‌లోకి అడుగుపెట్టిన వెంటనే సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీ త‌న బ్యాట్ ప‌వ‌ర్ ను చూపించాడు. న్యూజిలాండ్ సిరీస్ కు భార‌త జ‌ట్టులో పోటీకి సిద్ధంగా ఉన్నాన‌నే సంకేతాలు పంపాడు. 

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. దీని తర్వాత, త్వరలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా జట్టును చూస్తాము. అక్టోబర్ 16 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. సర్ఫరాజ్ డబుల్ సెంచరీ తర్వాత, ప్లేయింగ్ ఎలెవన్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌత‌మ్ గంభీర్ ఖచ్చితంగా క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంటుంది. స‌ర్ఫ‌రాజ్ కు టీమిండియాలో ప్రాధాన్యం ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ ను ఆడనుంది.  ఆ తర్వాత న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో తలపడనుంది. 

 

click me!