పొడవాటి జుట్టు ఇష్టపడని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా..? జుట్టు ఒత్తుగా,పొడుగ్గా, నల్లగా ఉంటే.. ఎవరికైనా అందాన్ని తెస్తుంది. కానీ.. ఈ రోజుల్లో పొడవాటి జుట్టు కాదు కదా... ఉన్న కాసిన్ని వెంట్రుకలు అయినా ఎలా కాపాడుకోవాలిరా అన్నట్లు ఉంది పరిస్థితి. ఉన్న కాస్త జుట్టును కాపాడుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి ఏవేవో నూనెలు, క్రీములు వాడుతూ ఉంటారు. అయితే.. ఇవన్నీ చేసినా కూడా జుట్టు పెరగడం లేదని బాధపడుతున్నారా..? అయితే..ఈ సమస్యకు మా దగ్గర పరిష్కారం ఉంది.
మీరు జుట్టు మంచిగా పెరగాలి అనుకుంటే... ఫుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. జుట్టు పెరుగుదల ఆగిపోవడానికి, జుట్టు రాలడానికి కారణాలు చాలా ఉండొచ్చు. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, శరీరంలో అవసరమైన పోషకాహార లోపం, ఒత్తిడి, థైరాయిడ్, ప్రసవానంతర జుట్టు రాలడం, జన్యుపరమైన కారణాలతో సహా అనేక కారణాలు జుట్టు పెరుగుదల లోపానికి కారణం కావచ్చు. మీరు పొడవాటి, మందపాటి , బలమైన జుట్టును పొందాలనుకుంటే, ముందుగా మీరు ఆహారంపై శ్రద్ధ వహించాలి. మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే, జుట్టు పొడవుగా ,ఒత్తుగా ఉండేలా చేస్తుంది. మరి ఎలాంటి ఫుడ్స్ తింటే.. మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుందో తెలుసుకుందాం...
fig fruit
1.అత్తి పండు, డేట్స్, ఎండు ద్రాక్ష..
డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే.. మూడు డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా అత్తి పండు, డేట్స్, ఎండు ద్రాక్ష.. వీటిని కనుక రోజూ మీ డైట్ లో భాగం చేసుకోవాలి. ఈ మూడు తీసుకుంటే.. కచ్చితంగా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ మూడే ఎందుకు అంటే.. వీటిలో ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ , విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఉదయం అల్పాహారంతో నానబెట్టిన 2 ఖర్జూరాలు, 2 అత్తి పండ్లను, 1 టేబుల్ స్పూన్ ఎండుద్రాక్షను తినండి. ఇది మీకు తక్షణ బలాన్ని ఇస్తుంది. శరీరంలో ఐరన్ లెవెల్ సరిగ్గా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు ఇది చాలా ముఖ్యం.
2.వాల్నట్...
వాల్నట్స్ ని రెగ్యులర్ గా మీ డైట్ లో భాగం చేసుకోవడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వాల్‌నట్‌లు సెలీనియం కి మంచి మూలం, ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. వాటిలో బయోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
ragi
3.రాగి పిండి...
రాగి సూపర్ ఫుడ్ కంటే తక్కువ కాదు. ఇందులో ఐరన్, కాల్షియం , ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. జుట్టు పెరుగుదలకు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. మీరు రాగుల పిండి నుండి దోసె, సూప్ , అనేక ఇతర వస్తువులను తయారు చేసుకోవచ్చు. కాబట్టి.. రాగి పిండిని ఏదో ఒక రూపంలో మీరు మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
4.దానిమ్మ...
దానిమ్మలో విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం , ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి ఇనుమును అందిస్తుంది. అలాగే, ఇందులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో , జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయపడుతుంది.