Tim Paine: జెంటిల్మెన్ గేమ్ లో జగత్ కంత్రీలు.. క్రికెట్ లో అతి పెద్ద సెక్స్ స్కాండిల్స్ ఇవే..

First Published Nov 19, 2021, 1:11 PM IST

Sex Scandals In Cricket History: ఇంగ్లాండ్ లో పురుడు పోసుకుని ప్రపంచ దేశాలకు పాకిన  క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ గా పిలుస్తారు. అయితే ఈ ఆటకున్న పేరును, ఆటలోని స్ఫూర్తిని దెబ్బతీయడానికి పలువురు క్రికెటర్లు నీచపు పనులు చేస్తూ క్రికెట్ పరువును గంగలో కలుపుతున్నారు. 

క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ తో పోలుస్తారు.  ప్రొఫెషనల్ గేమ్ గా ఈ ఆట ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.  ఇంగ్లాండ్ లో పురుడు పోసుకుని.. దేశ  విదేశాలకు చేరువైన ఈ ఆటకు ఆ దేశంతో పాటు ఆస్ట్రేలియా, ఇండియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ వంటి పెద్ద దేశాలలో కూడా విపరీతమైన  క్రేజ్ ఉంది. అయితే ఈ  ఆట స్ఫూర్తిని దెబ్బతీయడానికి.. క్రికెట్ పరువును గంగలో కలపడానికి కొంతమంది క్రికెటర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. క్రికెట్ చరిత్రలో ఇలాంటి పనులకు పాల్పడిన ప్రబుద్ధులెవరో ఇక్కడ చూద్దాం. 

టిమ్ పైన్.. ఆస్ట్రేలియా టెస్టు జట్టును నడిపిస్తున్న పైన్ తన సహోద్యోగితో అసభ్యకరంగా ప్రవర్తించాడని క్రికెట్ ఆస్ట్రేలియా చేపట్టిన విచారణలో తేలింది. 2017లో తన తో పని చేస్తున్న ఓ మహిళకు పైన్ అసభ్యకరమైన రీతిలో సందేశాలు పంపాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. అసభ్యకర రీతిలో ఉన్న తన ఫోటోతో పాటు వార్తలో రాయలేని విధంగా సందేశాలు పంపించాడు. ఇందుకు సంబంధించి సదరు మహిళ క్రికెట్ ఆస్ట్రేలియా కు ఫిర్యాదు చేసింది. దీనిపై సీఏ విచారణ చేపట్టింది. పైన్  ను కూడా విచారించింది. 

కెవిన్ పీటర్సన్.. దక్షిణాఫ్రికాలో పుట్టి ఇంగ్లాండ్ తరఫున క్రికెట్ ఆడి ప్రశంసలు పొందిన  పీటర్సన్  ఈ కామ క్రీడకు అతీతుడేమీ కాదు. తన గర్ల్ ఫ్రెండ్ నిమ్మోను శృంగారం కోసం వేధించాడని ఏకంగా ఆమె బహిరంగ ప్రకటన చేసింది. ‘కెవిన్ సెక్స్ చేయడానికి ఆకలిగా ఉన్నాడు. రోజంతా నన్ను  ఇబ్బంది పెట్టాడు. అతడి  వైఖరిపై నాకు అసహ్యమేస్తుంది..’ అని బ్రేకప్ తర్వాత తెలిపింది. 

షేన్ వార్న్.. ప్రపంచ క్రికెట్ లో తన  స్పిన్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న షేన్ వార్న్ గతంలో సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2006 లో కౌంటీ ఛాంపియన్షిప్ కు ముందు ఇద్దరు మోడళ్లతో శారీరక సంబంధాలను కలిగిఉన్నాడని వార్న్ పై ఆరోపణలు వచ్చాయి. ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి ఆరోపణలు చాలా ఎదుర్కున్నాడు. వార్న్ తో గడిపిన ఓ మహిళ.. ‘షేన్ చాలా ఫిట్ గా ఉన్నాడు. మమ్మల్ని చాలా సంతృప్తి పరిచాడు. మేము అతడికి టాప్ మార్కులిస్తాము. మాతో అతడు గొప్ప సమయాన్ని గడిపాడు..’ అని నివేదించిందంటే మనోడి ప్రతిభ అర్థం చేసుకోవచ్చు. 

క్రిస్ గేల్.. యూనివర్సల్ బాస్ గా పేరున్న గేల్ ఆటతో పాటు ఆ పనిలో కూడా వీర విధ్వంసకరుడే. క్రికెట్ లేని సమయంలో జమైకన్ బీచ్ లలో చుట్టూ అమ్మాయిలతో మనోడి ఎంజాయ్మెంట్ మాములుగా ఉండదు. బీబీఎల్ మ్యాచ్ సందర్భంగా ఓ టీవీ రిపోర్డర్ తో  అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను డ్రింక్ కోసం బయటకు తీసుకెళ్లి అక్కడా ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె గేల్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక 2012 లో శ్రీలంకలో నిర్వహించిన టీ20 ప్రపంచకప్ లో హోటల్ రూమ్ లో ముగ్గురు బ్రిటీష్ మహిళలతో అసహ్యకర రీతిలో  వ్యవహరించాడని గేల్ పై ఆరోపణలు  వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో గేల్ మాట్లాడుతూ.. తనది ‘చాలా చాలా పెద్ద బ్యాట్..’ అంటూ విపరీత వ్యాఖ్యలు చేశాడు. 

హెర్షలీ గిబ్స్.. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గిబ్స్ కూడా లైంగిక కుంభకోణాల్లో వేలు పెట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే తన ఆత్మకథ ‘టు ది పాయింట్’లో వెల్లడించాడు. అందులో ఓ  వాక్యం రాస్తూ... ‘నేను సెంచరీ సాధించబోతున్నాను. బహుశా నా పక్కన మంచం మీద పడుకున్న అమ్మాయి నన్ను ప్రేరేపించి ఉండొచ్చు. ఆమె శక్తులు నేను ఫీల్డింగ్ లో ఉపయోగించాలనుకుంటున్నాను..’ అని రాసుకొచ్చాడు. మరో చోట.. ‘రెండు పడకలు.. ఇద్దరు క్రికెటర్లు.. ముగ్గురు మహిళలు.. ఒక అమ్మాయి అంత ఆసక్తిగా అనిపించలేదు. కానీ మిగతా ఇద్దరు మాత్రం అదరహో.. అనుకున్న దానికంటే ఎక్కువ సంతృప్తిపరిచారు..’ అని పేర్కొన్నాడు. 

షాహిద్ అఫ్రిది.. పాకిస్తాన్ ఆల్ రౌండర్, ఆ జట్టు మాజీ ఆటగాడు అఫ్రిది పై కూడా ఈ ఆరోపణలు వచ్చాయి. 2000 సంవత్సరంలో కరాచీలోని ఒక హోటల లో ఒకే గదిలో ఉన్న అఫ్రిది, హసన్ రాజా, అతిక్ లు  వారి గదికి వచ్చిన యువతులపై అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణ. అయితే పీసీబీ దీనిపై విచారణ చేపట్టగా.. ఆ ముగ్గురు క్రికెటర్లు సమాధానం చెబుతూ.. ఆ యువతులు ఆటోగ్రాఫ్ కోసం తమ దగ్గరకు వచ్చారని చెప్పారు. అయితే పీసీబీ దీనికి సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత 2000లో కెన్యాలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో వారిపై వేటు వేసింది. 

ఇయాన్ బోథమ్.. ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ పై కూడా లైంగిక ఆరోపణలు వచ్చాయి.  ఇయాన్, ఆసీస్ కు చెందిన ఓ  అమ్మాయితో ఎఫైర్ లో ఉన్నాడని ఆయన భార్య ఆరోపించింది.   తనతో విహారయాత్రలో ఉంటూనే ఆ అమ్మాయితో  వేరే హోటల్  రూమ్ లో గడిపాడని ఆరోపిస్తూ ఆమె విడాకులు కూడా ఇచ్చింది. 

click me!