Trade war: యుద్ధానికి అర్థం మారిందా.? దేశాల మధ్య ట్రేడ్‌ వార్‌ జరగనుందా? భారత్‌పై దీని ప్రభావం ఏంటి?

ఏమంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడో ఆ రోజు నుంచి ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. మొన్నటి వరకు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని తిరిగి పంపించే పని పెట్టుకున్న ట్రంప్‌ ఇప్పుడు టారిఫ్‌ల రచ్చకు తెర తీశాడు. ప్రపంచ దేశాలపై ఎడాపెడా సుంకాలను పెంచేశాడు. ప్రతీకార సుంకం పేరుతో ప్రపంచంపై బాంబు పెల్చేశాడు. దీంతో ప్రపంచ దేశాల స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ తరుణంలో ప్రపంచ దేశాల నడుమ ట్రేడ్‌ వార్‌ జరగనుందా.? అన్న ప్రశ్న వస్తోంది. ట్రంప్‌ దెబ్బకు ఏం జరగనుంది.? ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Trade War 2025: Are Countries Gearing Up for a New Economic Battle? Impact on India Explained in telugu

సూటిగా...  స్పష్టంగా...  క్లుప్తంగా .. ఆర్థిక విషయాలు చాలామందికి అర్థం  కాని పజిల్స్ . దీనితో మసి పూసి  మారేడు కాయ చేసేవారు ఎక్కువ ! ఇదిగో మీ క్లారిటీ కోసం ! ట్రేడ్ వార్ జరుగనుందా? నలబై ఏళ్ళ క్రితం అమెరికా వాడు శాసించాడు, ప్రపంచం పాటించింది . ప్రపంచ   బ్యాంకు  , ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ , వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజషన్ , గాట్.. ఇలా ఎన్నో పద్ధతులు ద్వారా ప్రపంచ దేశాలను శాసించాడు, నిర్బంధించాడు. అప్పటిదాకా దేశాలు.. రక్షిత విధానాలు అనుసరించేవి . తమ అవసరాలను దేశీయంగా తీర్చుకొనేవి . అమెరికా వాడి  చలవ వల్ల ఆర్థిక పగ్గాలను ఎత్తేశాయి. దీనితో ప్రపంచ  ఆర్థిక వ్యవస్థ సాధ్యమయ్యింది .

ముందుగా ఒక మాట.  దీని వల్ల ఓవర్ అల్ గా మన దేశానికి లాభం కలిగిన మాట వాస్తవం.  సంపద పెరిగింది, సంక్షేమ కార్యక్రమాలు సాధ్యమయ్యాయి. అమెరికా వాడిది మాజీ జమీందార్ స్థితి . పని చేసేవాళ్ళు తక్కువ . సంపద కంటే ఖర్చులు ఎక్కువ. దీనితో చైనా లాంటి దేశాల  నుంచి దిగుమతులు ఎక్కువయ్యాయి. అమెరికా వాడి అప్పులు పెరిగాయి . ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ  ఆసుపత్రిలో చేరింది.  ఒక ఊళ్లో" గతం ఘనం  వర్తమానం బిన్నం"  టైపు మాజీ జమీందార్.. అప్పులు తెచ్చి బతుకుతున్నాడు. పాత  అప్పులు కొత్త అప్పులతో తీరుస్తున్నాడు. తిరుపతిలో ఆ మధ్య చాల మంది రొటేషన్ కింగులు దివాళా తీసి ఐపి పెట్టేశారు. అమెరికా వాడి స్థితి కూడా ఇదే.  న్యూ యార్క్ లో వాడి విదేశీ అప్పు గడియారం నిరంతరాయంగా పరుగెడుతుటుంది .

ట్రంప్ వ్యాపారస్తుడు, జరగబోయేది  తెలుసు. దీంతో తేనే తుట్ ను కదిలించాడు. ఇతర దేశాల దిగుమతులపై  పై టారిఫ్ పెంచాడు . చైనా నుంచి దిగుమతి చేసుకొనే ఉత్పత్తుల పై ఏకంగా 100 శాతం అంటున్నాడు. అంటే ఒక ఆపిల్ ఫోన్ అనుకొందాము . దాని రేట్ లక్ష అయితే , ఇప్పుడు రూ. 2 లక్షలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది చిలికి చిలికి గల వాన అవుతుందా ? అవును అని ఖచ్చితంగా చెప్పలేము . అవకాశాలు ఉన్నాయి.  అప్పుడు అన్ని దేశాలు ఇలా దిగుమతులపై టాక్స్ లు పెంచుతాయి . అప్పుడేమవుతుంది ? ఒక్క మాటలో చెప్పాలంటే దేశం 1990  ముందు రోజులకు వెళ్లి పోతుంది. అప్పుడెలా    ఉంటుంది ? ఈ నలబై సంవత్సరాల్లో ఆర్థిక సంస్కరణలు , ప్రపంచీకరణ ఎవరిని ఎలా ప్రభావితం చేసింది ?  ఇప్పుడు దానికి రివర్స్ జరుగుతుంది . ముందుగా ఒక మాట . మీకు విషయం  స్థూలంగా అర్థం కావడానికి బాగా  సింప్లీఫై చేస్తున్నా. నేను కింద చెప్పిన ప్రతి పాయింట్ కు మినహాయింపులు ఉంటాయి అని గమనించగలరు . 
 

స్థూలంగా చెప్పాలంటే ..

1)  నలబై ఏళ్లలో రైతులు దారుణంగా నష్ట పోయారు. వ్యవసాయం అంటే చావుల పంట అన్నట్టు తయారయ్యింది. లెక్కకు మించి  రైతులు ఆత్మ హత్యలు చేసుకొన్నారు . గ్రామాలు ఖాళీ అయిపోయాయి. ఒక్క మాట లో చెప్పాలంటే ఇప్పుడు ఆర్థిక మాంద్యం  వచ్చినా ... గ్లోబల్ ట్రేడ్ వార్ జరిగినా రైతు కు నష్టం ఉండదు. పైగా గత   వైభవం వచ్చే అవకాశం . మన దేశం లో వ్యవసాయం  చచ్చి పోలేదు . ప్రతి ఇంట్లో...  ఆమె మేడలో  బంగారం. అనేక దేశాల్లో ఆర్థిక మాంద్యం వస్తే...  ఆకలి తో జనాలు చచ్చిపోయే ప్రమాదం. మన దేశం లో గ్రామాలకు వ్యవసాయ దారులకు రైతు కూలీలకు డోకా లేదు . పొదుపు చేసిన వాడు బతికేస్తాడు .

2) ఈ నలబై ఏళ్లలో సంపదను పది రెట్లు చేసుకున్నవారికి గడ్డు కాలం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫారిన్ బ్రాండ్స్ . ఒక మాల్ లో అడుగుపెడితే యాభై షాప్స్ లో నలభై అయిదు బ్రాండ్స్ ఫారిన్ ఫ్రాంచైజ్ లే . కొంతమంది అయితే  పొద్దున్న తినే బ్రేక ఫాస్ట్ మొదలు రాత్రి పడుకొనే బెడ్ దాక ఫారిన్ బ్రాండ్స్ . ఇలాంటి వారు దారుణంగా నష్ట పోతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నడ మంత్రపు సిరి వర్గాలకు గడ్డు కాలం. ఎక్కడో ఎవడో చేసిన శాసనం … తాను  నమ్ముకొన్న ... తన పూర్వీకులను తరతరాలు పోషించిన పొలం...  తనకు స్మశానం అయిన వేళ  . తన ఎడ్ల మేడలో పలుపుతాడు తనకు ఉరితాడు .. లేదా తాను కొన్న.. కొన్న కాదు .. తాను కొనేలా చేసిన ఫారినోడి పురుగుమందు తన గొంతు లో దిగిన...  వేళ … రైతు ఘోష  .. మనకు      తగిలిందేమో. కాలం మారింది అన్నాము.  ఇప్పుడు రివర్స్ అవుతుందా ? మన జాగ్రత్తలో మనం ఉందాము .  ఇంత సింపుల్ అంటారా ? కాదు లెండి. దబ్బున వాడు అంత ఈజీ గా నష్టపోతాడా ? తిమ్మిని బమ్మిని చేసి కష్ట జీవుల శ్రమ ను దోపిడీ చేస్తాడు . కొత్త స్కీమ్స్ తో వస్తారు. బంగారం ధర పడిపోతుంది అని ప్రచారం వెనుక కూడా ఏదో మతలబు వుంది . కరోనా తరువాత యాభై సార్లు లాక్ డౌన్ గ్యారెంటీ అని ఊదర గొట్టిన గొట్టాలు ఇప్పుడు ఏదో ప్లాన్ లో వున్నాయి.  వీరు చెప్పే వారే, చెప్పించే వారు ఎక్కడో ఉంటారు. 
 


బంగారం ధర తగ్గాలంటే ..

1)  డాలర్ రేట్ బాగా పెరగాలి . 
2)  అమెరికా రిజర్వు హై ఇంటరెస్ట్ రేట్స్ మైంటైన్ చెయ్యాలి .
3) బ్యాంకు లు కస్టమర్స్ కిచ్చే వడ్డెలు బాగా పెంచాలి .
4)  రిజర్వు బ్యాంకు లాంటి సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడం తగ్గించాలి. ఉన్న బంగారాన్ని అమ్మడం మొదలు పెట్టాలి . 
5)  స్టాక్ మార్కెట్ పుంజుకోవాలి.

ఇప్పుడు సరిగ్గా రివర్స్ లో జరుగుతున్నాయి . స్టాక్ మార్కెట్ భారీ పతనం.పైన చెప్పినవి జరిగితే మీ బంగారాన్ని అమ్ముకోండి . ఒకటి క్లియర్ గా చెబుతున్నా. బంగారాన్ని బెట్టింగ్ సరుకుగా కొనొద్దు . ఇందాక ఒకాయన క్లియర్ గా పోస్ట్ పెట్టిన చదివే ఓఐపీక లేక కావొచ్చు .. ఫైనల్ గా ఒక మాట చెప్పండి అన్నారు . వద్దు కొనొద్దు అన్నాను . కారణం దాన్ని మనీ multiplication కోసం వాడొద్దు అని నేను చెప్పడం. మీ ఇంట్లో మీ అమ్మమ్మ గారు .. నాయనమ్మ గారు వుంటారు . వారిని అడగండి . బంగారం కష్టకాలం లో ఎలా  ఆదుకొంది అని . నేను చెప్పింది కూడా అదే మాటే . బతకలేనప్పుడు బంగారం బతుకు చూపుతుంది.
 

Latest Videos

vuukle one pixel image
click me!