India Pakistan War: మళ్లీ పెరిగిన బంగారం ధరలు: ఇండియా-పాక్ యుద్ధమే కారణం. గోల్డ్ ఎంత పెరిగిందంటే..

Published : May 09, 2025, 11:26 AM IST
India Pakistan War: మళ్లీ పెరిగిన బంగారం ధరలు: ఇండియా-పాక్ యుద్ధమే కారణం. గోల్డ్ ఎంత పెరిగిందంటే..

సారాంశం

India Pakistan War: ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తతలు గోల్డ్ మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయి. మొన్నటి వరకు పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఒక్కసారిగా పడిపోయాయి. అయితే అనూహ్యంగా మే 9న దేశీయంగా బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఎంత పెరిగాయి. ప్రస్తుతం ధర ఎంత ఉంది? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌లో బంగారం ధరలు మే 9న పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.9,149.95గా నమోదైంది. ఇది ముందు రోజు ధర అయిన రూ.9,122.89తో పోలిస్తే పెరిగింది. 10 గ్రాముల ధర రూ.91,500.50గా ఉంది. 

మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే..

మార్కెట్ నిపుణుల ప్రకారం, అంతర్జాతీయంగా బంగారం ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మొగ్గుచూపుతున్నారు. పాక్ స్టాక్ మార్కెట్ కుదేలవడం కూడా గోల్డ్ మార్కెట్ పై ప్రభావం పడుతోంది. వీటికి తోడు ట్రంప్ యునైటెడ్ కింగ్‌డమ్‌తో వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర 2 శాతానికి పైగా తగ్గడానికి  కారణమైంది.

అంతర్జాతీయంగా తగ్గుదల

అంతర్జాతీయంగా అమెరికా-బ్రిటన్ మధ్య ట్రేడ్ డీల్ కారణంగా బంగారం ధరలు కొంత తగ్గాయి. అయితే దేశీయంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

దేశీయంగా పెరుగుదల

ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు ఈ పరిస్థితిని గమనించి, తమ పెట్టుబడులను సురక్షితంగా ఉంచుకోవడానికి బంగారం కొనుగోలు చేస్తున్నారు.

తగ్గుతున్న రూపాయి విలువ

అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను నడిపిస్తున్నాయి. అయినా కూడా రూపాయి విలువ తగ్గడం వల్ల దేశీయంగా బంగారం ధరలు మరింత పెరిగి అవకాశం ఉంది. గత 24 గంటల్లో ఇది దాదాపు 1.5 శాతం బలహీనపడింది. ప్రస్తుత పరిస్థితి మరింత పెరిగితే రూపాయి విలువ మరింత తగ్గవచ్చు. దీనివల్ల బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. యుఎస్ ఫెడ్ సమావేశం నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవల తగ్గుతూ వస్తున్నాయి. ఇంతకు ముందు పది గ్రాములకు రికార్డు స్థాయిలో రూ. లక్ష వరకు ఉండటంతో ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌.. హైద‌రాబాద్‌లో మ‌రో ఫ్లై ఓవ‌ర్‌, 6 లైన్ ఎక్స్‌ప్రెస్ వే
Business Idea: మీ బిల్డింగ్‌పై ఖాళీ స్థ‌లం ఉందా.? మీరు ల‌క్షాధికారులు కావ‌డం ఖాయం