ఐఫోన్ 15 కేవలం రూ.24,950కే! అమెజాన్ ఆఫర్ అదిరిపోయిందిగా..

Published : May 08, 2025, 04:30 PM IST
ఐఫోన్ 15 కేవలం రూ.24,950కే! అమెజాన్ ఆఫర్ అదిరిపోయిందిగా..

సారాంశం

రూ.69,900 ఐఫోన్ 15 ఇప్పుడు అమెజాన్లో 16% తగ్గింపుతో లభిస్తోంది. ఈ డిస్కౌంట్ తో పాటు అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇవన్నీ కలిపితే ఇప్పుడు ఐఫోన్ 15 కేవలం రూ.24,950కే మీకు సొంతం చేసుకోవచ్చు. 

ఐఫోన్ 15 కొనాలని ఉన్నా.. ధర ఎక్కువ అని ఆగిపోయారు. అయితే ఇప్పుడే కొనేయండి. ఐఫోన్ 16 సిరీస్ వచ్చాక అమెజాన్ ఇండియా ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. 128 GB బ్లాక్ వేరియంట్‌పై అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్ ఉంది. ధర తగ్గడమే కాదు.. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీంతో ధర రూ.25,000 కంటే తక్కువకే వస్తుంది. అమెజాన్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 15 ఎలా కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్ 15పై 16% డిస్కౌంట్

రూ.69,900 ఐఫోన్ 15 ఇప్పుడు అమెజాన్‌లో 16% తగ్గింపుతో రూ.58,999కే లభిస్తోంది. అంతే కాదు, ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది. దీంతో ధర రూ.25,000 కంటే తక్కువకే వస్తుంది.
 
మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఇంకా తక్కువ ధరకే వస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో రూ.51,100 వరకు తగ్గింపు లభిస్తుంది. ఉదాహరణకు ఐఫోన్ 14 ఎక్స్చేంజ్ చేస్తే రూ.34,200 తగ్గుతుంది. మీ పాత ఫోన్ మోడల్, కండిషన్ బట్టి ఐఫోన్ 15 ధర రూ.24,799 వరకు తగ్గవచ్చు.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్స్

ఐఫోన్ 15లో 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, డైనమిక్ ఐలాండ్, డాల్బీ విజన్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంది. IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. A16 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 14 ప్రోలో ఉన్న చిప్ ఇదే. ఫోటోగ్రఫీ కోసం 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వైర్డ్, మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

ఈ బ్యాంకులో రుణం తీసుకుంటే మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు

 

PREV
Read more Articles on
click me!