సైరాలో ఆ పదాలు మ్యూట్ చేసిన సెన్సార్.. సినిమా నిడివి ఎంతంటే!

By tirumala ANFirst Published Sep 26, 2019, 6:48 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా రిలీజ్ కు రంగం సిద్ధం అయింది. తెలుగు సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా సైరా చిత్రంపై అంచనాలు నెలకొని ఉన్నాయి. ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

మెగాస్టార్ చిరంజీవి నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. రాంచరణ్ నిర్మాత. ఇటీవల సైరా చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు యుఏ కేటగిరిలో సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ విడుదల చేశారు. 

సైరా చిత్రం భారీ స్థాయిలో 170 నిమిషాల 50 సెకండ్ల నిడివితో రానుంది. ఇది చాలా ఎక్కువ రన్ టైం. కానీ చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో కథ ఏమాత్రం ఎక్కువ ఉండడం సహజం. ఇదిలా ఉండగా సెన్సార్ సభ్యులు సైరా చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా ఒకే చెప్పారు. 

కానీ చిత్రంలో వచ్చే కొన్ని పరుషపదజాలాలని మాత్రం మ్యూట్ చేశారు. మొత్తంగా జీరో కట్స్ తో సైరా చిత్రం రిలీజ్ కు సిద్ధం అవుతోంది. వాస్తవానికి సినిమా నిడివి 169 నిమిషాలు. హెచ్చరిక, ఇతర ప్రకటనలతో కలుపుకుంటే 170 నిమిషాలకు పైగా నిడివి ఉంటుంది. 

'సైరా'కి ఇక అడ్డులేదు.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు షాక్!

పవన్ కళ్యాణ్ కూడా సైరా కథ అడిగాడు.. మా డైలాగ్స్ లేకున్నా పర్వాలేదు!

బ్రేకింగ్: సైరాకు హైకోర్టులో షాక్.. ఏం జరగబోతోంది!

click me!