పవన్ తో క్రిష్ కి చెడిందా... నిర్మాతకు లేని బాధ దర్శకుడికి ఎందుకు?

Published : May 01, 2024, 03:59 PM IST
పవన్ తో క్రిష్ కి చెడిందా... నిర్మాతకు లేని బాధ దర్శకుడికి ఎందుకు?

సారాంశం

హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ నుండి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నాడనే పుకార్లు తెరపైకి వచ్చాయి. హరి హర వీరమల్లు తాజా పోస్టర్స్ లో క్రిష్ పేరు లేకపోవడమే ఇందుకు కారణం. అనుష్క శెట్టితో క్రిష్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన నేపథ్యంలో హరి హర వీరమల్లుకు గుడ్ బై చెప్పేశాడని టాలీవుడ్ టాక్.   

పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే సహనం ఉండాల్సిందే. ఆయనది రెండు పడవల ప్రయాణం. పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్స్ ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. గత మూడేళ్ళుగా ఇదే జరుగుతుంది. అయితే మొదలు పెట్టిన హరి హర వీరమల్లు పక్కన పెట్టి రెండు రీమేక్ సినిమాలు పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్. హరి హర వీరమల్లు సెట్స్ పైకి వెళ్ళాక భీమ్లా నాయక్, బ్రో చకాచకా పూర్తి చేసి వదిలారు. 

హరి హర వీరమల్లు షూటింగ్ మాత్రం నత్తనడక సాగింది. సరే... భీమ్లా నాయక్, బ్రో తర్వాత అయినా హరి హర వీరమల్లు సెట్స్ లో పవన్ కళ్యాణ్ అడుగుపెడతాడు అనుకుంటే అదీ జరగలేదు. మరలా ఓ రీమేక్, ఒక స్ట్రెయిట్ మూవీ స్టార్ట్ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ కొంత మేర షూటింగ్ జరుపుకున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ తిరిగి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని హరీష్ శంకర్ హీరో రవితేజతో మిస్టర్ బచ్చన్ చేస్తున్నాడు. 

హరి హర వీరమల్లు విషయంలో పవన్ కళ్యాణ్ చేసింది కరెక్ట్ కాదు. ఈ భారీ ప్రాజెక్ట్ మొదలై రెండేళ్లు దాటిపోయింది. నిర్మాతకు భారం తడిసి మోపెడు అవుతుంది. ఏ ఎం రత్నం మాత్రం మౌనంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో ఆయనకున్న రిలేషన్ అలాంటిది. నిర్మాతకు డబ్బే పోతుంది. దర్శకుడికి మాత్రం సమయం వృద్దా అవుతుంది. డబ్బు కంటే స్ సమయమే విలువైనది కదా... క్రిష్ కి కోపం వచ్చి ఉండొచ్చు. ఆయన తప్పుకొని ఉండొచ్చు 

మే 2న హరి హర వీరమల్లు నుండి టీజర్ విడుదల కానుంది. ఈ అప్డేట్ కోసం రెండు పోస్టర్స్ విడుదల చేశారు. ఒక్క పోస్టర్ లో కూడా దర్శకుడు క్రిష్ పేరు లేదు. దాంతో క్రిష్ హరి హర వీరమల్లుకు గుడ్ బై చెప్పేశాడనే మాట వినిపిస్తుంది. ఇటీవల హీరోయిన్ అనుష్క శెట్టితో ఘాటి టైటిల్ తో ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఇవన్నీ గమనిస్తుంటే క్రిష్ పవన్ కళ్యాణ్ సినిమా నుండి తప్పుకుని ఉంటాడని అంటున్నారు. అధికారిక సమాచారం రావాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో