`నువ్వు గెడ్డం సవరిస్తే దేశమే దద్దరిళ్లే`.. `పుష్ప2` నుంచి `పుష్ప పుష్ప` సాంగ్‌ ఔట్‌.. ఎలా ఉందంటే?

Published : May 01, 2024, 05:33 PM IST
`నువ్వు గెడ్డం సవరిస్తే దేశమే దద్దరిళ్లే`.. `పుష్ప2` నుంచి `పుష్ప పుష్ప` సాంగ్‌ ఔట్‌.. ఎలా ఉందంటే?

సారాంశం

`పుష్ప2` నుంచి అంతా వెయిట్‌ చేస్తున్న సమయం వచ్చింది. `పుష్ప పుష్ప` పాట రానే వచ్చింది. పుష్ప రేంజ్‌ని తెలియజేసేలా సాగే ఈ పాట ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.   

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న `పుష్ప2` నుంచి తొలి పాట వచ్చింది. `పుష్ప పుష్ప` అంటూ సాగే పాటని విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాటని విడుదల చేశారు. ఈ సాయంత్రం `పుష్ప పుప్పు.. పుష్ప పుష్ప `అంటూ సాగే పాటని రిలీజ్‌ చేశారు. పుష్ప రాజ్‌ క్యారెక్టర్‌ని, పుష్పరాజ్‌ ఇమేజ్‌ని తెలియజేసేలా ఈ పాట సాగింది. గాంభీర్యమైన స్వరంగా ఈ సాంగ్‌ సాగడం విశేషం.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటని చంద్రబోస్ రాయగా, నకాష్‌ అజిజ్‌, దీపక్‌ బ్లూ ఆలపటించారు. `పుష్ప` సినిమాలో తొలి పాట నేచర్‌ గురించి చెప్పినట్టుగానే `పుష్ప2`లోనూ ఈ `పుష్ప పుష్ప` పాట ఉండటం విశేషం. సేమ్‌స్టయిల్‌ని ఫాలో అయ్యారు సుకుమార్‌. పాన్‌ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో ఈ పాటని విడుదల చేశారు. ఈ పాట ఆకట్టుకుంటుంది. ఆలోచింప చేస్తుంది.  `పుష్ప2` సినిమా స్థాయిలోనే పాట కూడా అదిరిపోయేలా ఉంది. అంతేకాదు ఇందులో పుష్ప బ్రాండ్‌ని కూడా చూపించడం విశేషం. ఇది బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుండటం విశేషం.

ఇక అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. టీజర్‌ చివర్లో బన్నీ ఇచ్చే యాక్షన్‌ అదిరిపోయింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఈగర్‌ మొత్తం వెయిట్‌ చేస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే